బిగ్ బాస్ 7 కోసం కమల్ రెమ్యునరేషన్ .. వామ్మో ఇంతనా?

ఈ మధ్య పారితోషికాల( Remunerations ) గురించి పెద్ద చర్చనే జరుగుతుంది.ఏ స్టార్ ను కదిలించిన పెద్ద పెద్ద నంబర్స్ నే వినిపిస్తున్నాయి.

అలాగే 100 కోట్లను మించి కూడా స్టార్స్ తమ రెమ్యునరేషన్స్ ను డిమాండ్ చేస్తున్న నిర్మాతలకు వారికీ సమర్పించు కోవడం విశేషం.ఎవరి క్రేజ్ కు తగ్గట్టుగా వారు పారితోషికం డిమాండ్ చేస్తున్నారు.

ఇక స్టార్ హీరోలు అయితే వందల కోట్లకు తక్కువ ఎవ్వరి గురించి చెప్పుకోవడం లేదు.ఇంతకు ముందు 20, 30 కోట్లు అంటేనే పెద్ద మొత్తం అని భావించేవారు.కానీ ఇప్పుడు అలా కాదు 100, 150 కోట్లు పుచ్చుకుంటుంటే పెద్ద మొత్తం అనాల్సి వస్తుంది.

మరి తాజాగా యూనివర్సల్ స్టార్ విశ్వనాయకుడు కమల్ హాసన్( Kamal Haasan ) రెమ్యునరేషన్ గురించి తీవ్రంగా చర్చ నడుస్తుంది.అది కూడా ఒక రియాలిటీ షో కోసం ఈయన పెద్ద మొత్తంలో పుచ్చుకుంటున్నట్టు టాక్.

Advertisement

బిగ్ బాస్( Bigg Boss ) అంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మరి తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 6 సీజన్స్ ముగించుకుని 7వ సీజన్( Tamil Bigg Boss 7 ) కోసం సన్నద్ధం అవుతుంది.

తమిళ్ లో కూడా ఈ షో 6 సీజన్స్ పూర్తి చేసుకుంది.

అయితే మన తెలుగులో బిగ్ బాస్ కు హోస్టులు మారుతూ వస్తున్నారు కానీ తమిళ్ లో మాత్రం గత 6 సీజన్స్ నుండి కమల్ హాసన్ నే చేస్తున్నారు.ఇప్పుడు 7వ సీజన్ కోసం రెడీ అవుతున్నారు.అయితే ఈసారి సీజన్ కోసం కమల్ పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్టు టాక్.

కమల్ హాసన్ ఏకంగా 130 కోట్ల రూపాయల పారితోషికం( Kamal Haasan Bigg Boss Remuneration ) పొందనున్నారని టాక్.మరి ఇదే నిజమైతే కమల్ సినిమాకు మించి రెమ్యునరేషన్ ఈ రియాలిటీ షోకు అందుకోనున్నారు అని తెలుస్తుంది.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు