ఆ నిర్మాత ఎఫైర్లు భరించలేక విడాకులు కోరుతున్న భార్య.. సంచలన ట్వీట్ చేసిన కేఆర్కే?

బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కెఆర్కే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేఆర్కే తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

 Kamaal R Khan Top Bollywood Producer Wife Asking Divorce , Krk, Kamaal R Khan, B-TeluguStop.com

ఎక్కువగా బాలీవుడ్ సినీ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటాడు.ఇప్పటికే గతంలో పలువురు సెలబ్రిటీలపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

హీరో, హీరోయిన్ లపై తీవ్ర విమర్శలు చేయడంతో అభిమానుల ఆగ్రహానికి లోనైన విషయం తెలిసిందే.అంతేకాకుండా అతనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు గుర్తించడంతోపాటు అభిమానులు మండిపడ్డారు.

అయినప్పటికీ మాత్రం కేఆర్కే ప్రవర్తనలో మార్పు రాలేదు.

కాగా కేఆర్కే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.

మరి ముఖ్యంగా సినిమాలకు తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ కొత్త కొత్త వివాదాలకు తెరలేపుతూ ఉంటాడు.సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ముందుగానే సినిమాలకు రివ్యూలు చెబుతూ ఆ సినిమాలో ఫ్లాప్ డిజాస్టర్ ప్రచారాలు చేస్తూ ఉంటాడు.

తరచూ ఏదో ఒక వివాదం లేకపోతే కేఆర్కే నిద్ర పట్టదు అని చెప్పవచ్చు.ఇది ఇలా ఉంటే తాజాగా కెఆర్కే ఒక సంచలన ట్వీట్ చేసాడు.దాంతో అటువైపే స్పందించిన పలువురు నెటిజెన్స్ కేఆర్కేపై మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఆ ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు.బ్రేకింగ్.ఒక పెద్ద నిర్మాత ఆ భార్య ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది.

ప్రస్తుతం ఒక హోటల్లో ఉంటుంది.తన భర్త చాలామందితో అఫైర్లు పెట్టుకున్నాడు అన్న కోపంతో అతనికి ఏకంగా విడాకులు ఇచ్చేందుకు సదరు నిర్మాత భార్య సిద్ధమయ్యింది అని తన ట్వీట్ లో రాసుకొచ్చాడు కేఆర్కే.

అయితే అతడు ఆ ట్వీట్ ని ఎవరిని ఉద్దేశించి అలా చేశాడు అన్నది మాత్రం నిజం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.ఈ ట్విట్ పై స్పందించిన కొందరు నెటిజన్స్ వ్యక్తిగత విషయాల్లోకి తొంగి చూడడం అవసరమా అని కామెంట్స్ చేయగా మరికొందరు ఇతరుల విషయాలు నీకు ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube