డబ్బింగ్ నా ? రీమేక్ నా ?.. బింబిసార విషయంలో కళ్యాణ్ రామ్ డైలమా!

టాలీవుడ్ కష్టకాలంలో ఉండగా ఆ పరిస్థితులను మార్చి మళ్ళీ బాక్సాఫీస్ కళకళ లాడేలా చేయడంలో బింబిసార సినిమా కూడా తోడ్పడింది.ఆగష్టు మొదటి వారం వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

 Kalyanram Confused Between Bimbisara Remake Dubbing, Kalyan Ram , Bimbisara Remake, Bimbisara Dubbing, Bimbisara , Samyukta Menon, Catherine Tresa, Director Vasisth Malladi-TeluguStop.com

జులై నెల మొత్తం బాక్సాఫీస్ వెలవెల బోయింది.వరుస ప్లాప్స్ తో సందడి లేకుండా పోయింది.

మరి అలాంటి సమయం లోనే బింబిసార కూడా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో బ్లాక్ బస్టర్ హిట్ చేసారు.

 Kalyanram Confused Between Bimbisara Remake Dubbing, Kalyan Ram , Bimbisara Remake, Bimbisara Dubbing, Bimbisara , Samyukta Menon, Catherine Tresa, Director Vasisth Malladi-డబ్బింగ్ నా రీమేక్ నా .. బింబిసార విషయంలో కళ్యాణ్ రామ్ డైలమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమాను యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడితెరకెక్కించారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఆయన కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.

అలాగే వసూళ్ల పరంగా కూడా టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఆశ్చర్య పరుస్తుంది.

ఇక ఈ సినిమాను ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ చేసారు.

ఈ సినిమా హిట్ అయితే అప్పుడు హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఆలోచనలు మరోలా ఉన్నాయి.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా లాభాలు కూడా తెచ్చిపెట్టడంతో అప్పుడే హిందీలో కూడా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అని అందరు అనుకుంటున్నారట.

Telugu Bimbisara, Catherine Tresa, Vasisth Malladi, Kalyan Ram, Samyukta Menon-Movie

అయితే ఇప్పుడు హిందీలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలనీ అనుకుంటుంటే కళ్యాణ్ రామ్ మాత్రం బింబిసార ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.హిందీ ప్రేక్షకులు మెచ్చే విధంగా తీయాలని చర్చలు జరుపుతున్నారట.మరి దీనిపై ప్రెజెంట్ చర్చల దశలోనే ఉండడంతో ఈ సినిమాను డబ్ చేయాలా? లేదంటే రీమేక్ చేయాలా ? అనేది ముందు ముందు వెల్లడించ నున్నారు.చూడాలి కళ్యాణ్ రామ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube