డెవిల్ గా మారిపోయిన కళ్యాణ్ రామ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోరుమీద ఉన్నాడు.గతంలో మాదిరి ఈ ఏడాది ఒక సినిమాలా కాకుండా ఒకేసారి 5 సినిమాలను లైన్లో పెట్టేసాడు.

 Kalyan Ram Movie Titled Devil, Tollywood, Naveen Medam, Abhishek Pictures, Peroi-TeluguStop.com

వాటిలో ఇప్పటికే వేణు మల్లిడి దర్శకత్వంలో బింబిసార సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయి పోస్టర్ కూడా రిలీజ్ అయింది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం.

మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ లో కూడా సినిమా చేయడానికి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దిల్ రాజు ప్రొడక్షన్లో కూడా మరో సినిమాకి ఓకే చెప్పాడు.

అలాగే గతంలో తనతో 108 మూవీ తెరకెక్కించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సెకండ్ మూవీ చేయడానికి కూడా సిద్ధమయ్యాడు.

ఇదిలా ఉంటే తాజాగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో నవీన్ మేడారం దర్శకత్వంలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు.

పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుండటం విశేషం.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు.

డెవిల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనున్నడం విశేషం.

Telugu Abhishek, Bimbasara, Devil, Kalyan Ram, Naveen Medam, Tollywood-Movie

టీజర్ బట్టి భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడట.ఈ విషయాన్ని ఫస్ట్ లుక్ టీజర్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఆవిష్కరించారు.

మొత్తానికి ఇప్పటి వరకు రెగ్యులర్ కథలతో జర్నీ చేసిన కళ్యాణ్ రామ్ ఒకేసారి ఐదు భారీ ప్రాజెక్టులను అది కూడా విభిన్న కథలతో చేయడానికి ఒకే చెప్పి అందరికీ ఊహించని ఆశ్చర్యాన్ని కలిగించాడని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube