టాలీవుడ్ లో నందమూరి హీరోలకు ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.నందమూరి తారక రామారావు గారితో మొదలైన ఈ నందమూరి సినీ ప్రస్థానం అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఎప్పటికీ చెరిగిపోని శాశ్వత ముద్ర తెలుగు ప్రేక్షకుల్లో వేసుకుంది.
నిన్నటి తరం హీరోలలో నందమూరి బాలకృష్ణ కి ఎలాంటి మాస్ క్రేజ్ వచ్చిందో మనమంతా చూసాము.మాస్ ఫ్యాన్ బేస్ అంటే బాలయ్య బాబుదే అని అందరూ అనుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కూడా ఈ జనరేషన్ లో అదే రేంజ్ మార్క్ ని ఏర్పాటు చేసుకున్నాడు.అయితే ఇంతమంది హీరోలు నందమూరి ఫ్యామిలీ లో ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య మెగా హీరోల రేంజ్ రిలేషన్ లేదని అర్థం అవుతూ ఉంటుంది.
మెగా ఫ్యామిలీ లో ప్రతీ హీరో ఒకరి మీద ఒకరు ఎంతో ప్రేమగా ఉంటూ ఉంటారు.
కానీ నందమూరి ఫ్యామిలీ బాలయ్య బాబు( Balayya Babu ) తో జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఎప్పుడు దూరంగా ఉంటున్నట్టుగానే అనిపిస్తుంది.రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా వాళ్ళ మధ్య ఉన్న దూరం శాశ్వతం అయ్యిందని తెలుస్తుంది.ఎన్టీఆర్ ని బాలయ్య బాబు అసలు లెక్కచెయ్యకపోవడం, అలాగే ఎన్టీఆర్ కూడా అదే ధోరణి వ్యవహరించడం పై నందమూరి అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే రీసెంట్ గా కళ్యాణ్ రామ్ డెవిల్ అనే చిత్రం చేసాడు.ఈ సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు.ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.తన ప్రతీ సినిమాతో కొత్త డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసే అలవాటు ఉన్న కళ్యాణ్ రామ్, ఈ సినిమా తో అభిషేక్ నామా( Abhishek Nama ) అనే వ్యక్తిని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ అభిషేక్ నామా బాలయ్య బాబు ని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుంది అని భావించాడట.ఇదే విషయాన్నీ కళ్యాణ్ రామ్( Kalyan Ram ) కి చెప్పగా, ఆయన వెంటనే నో చెప్పినట్టు సమాచారం.ప్రస్తుతానికి బాబాయ్ ని పిలవాల్సిన అవసరం లేదు, పిలిచినా ఆయన రాడు, బాలయ్య బాబు ని పిలవాలనే ఆలోచన కూడా పెట్టుకోకండి అంటూ కళ్యాణ్ రామ్ చెప్పాడట.
ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వుతుంది బాలయ్య బాబు కి మరియు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు చాలా దూరం ఏర్పడింది అనే విషయం అర్థం అవుతుంది.