'అమిగోస్' టీజర్.. మూడు షేడ్స్ లో అదరగొట్టిన కళ్యాణ్ రామ్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ సినిమాలు తక్కువ అనే చెప్పాలి.ఈయన తన కెరీర్ మొత్తం చూసుకుంటే ఒకటి రెండు మినహా మిగతావన్నీ డిజాస్టర్ సినిమాలే.

 Kalyan Ram Amigos Teaser Details, Nandamuri Kalyan Ram, Kalyan Ram ,bimbisara 2,-TeluguStop.com

ఒకవైపు తన తమ్ముడు వరుస హిట్స్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోతే ఈయన మాత్రం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు.అయితే ఇది మొన్నటి వరకు జరిగిన కథ.

ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

వసిష్ఠ మల్లిడి తెరకెక్కించిన ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎప్పటి నుండో ఉన్న కల తీరిపోయింది.ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని కళ్యాణ్ రామ్ ప్రకటించడమే కాకుండా అందుకు తగ్గట్టుగా సన్నాహాలు కూడా చేస్తున్నాడు.

ఇది కాకుండా ప్రెజెంట్ కళ్యాణ్ రామ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.అందులో మైత్రి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది.గత ఏడాది లోనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాకు ‘అమిగోస్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఈ సినిమాను రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో చేస్తున్న ఈ సినిమా షూట్ ఇటీవలే పూర్తి అవ్వడంతో ఇప్పుడు వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా డేట్ ను ప్రకటించగా తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసారు.ఈ టీజర్ చూస్తుంటే ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ చేస్తుంది అనే చెప్పాలి.ట్రైలర్ లో స్టోరీ పెద్దగా రివీల్ చేయకపోయినా కళ్యాణ్ రామ్ మూడు షేడ్స్ లో మాత్రం అదరగొట్టాడు అనే చెప్పాలి.

చూడాలి బింబిసారా విజయాన్ని కొనసాగిస్తాడో లేదో.ఇక ఈ సినిమా ఫిబ్రవరి 10, 2023న రిలీజ్ కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube