మెగా ఫ్యామిలీ నుండి కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకోవడంతో కళ్యాణ్‌కు భారీ ఎంట్రీ దక్కబోతుంది.
హీరో అవ్వాలనే కోరికతోనే చిరంజీవి కూతురును కళ్యాణ్ వివాహం చేసుకుని ఉంటాడు అనే టాక్ కూడా ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతుంది.ఆ విషయాన్ని పక్కకు పెడితే హీరో అయ్యేందుకు కళ్యాణ్ చాలానే వర్కౌట్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
దాదాపు సంవత్సరం పాటు హీరోకు కావాల్సిన అన్నింటి కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు.డైలాగ్ డెలవరీ, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్ ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో కళ్యాణ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.

చిరంజీవి అల్లుడు అవ్వడంతో కళ్యాణ్ సినిమాను నిర్మించేందుకు పలువురు నిర్మాతలు ముందుకు వచ్చారు.అయితే అభిరుచి ఉన్న నిర్మాత అవ్వడంతో సాయి కొర్రపాటి చేతిలో తన అల్లుడిని పెట్టడం జరిగింది.సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో కళ్యాణ్‌లో టెన్షన్ పెరిగి పోతుందట.ఈనెల 12న విడుదల కాబోతున్న ‘విజేత’ చిత్రం ప్రమోషన్స్‌లో కళ్యాణ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ పాల్గొంటున్నాడు.
ఈ సమయంలోనే కళ్యాణ్ సినిమా విడుదల దగ్గర పడుతున్నా కొద్ది తనకు టెన్షన్ అనేది పెరిగి పోతుందని చెప్పుకొచ్చాడు.
వారం రోజులు సినిమా విడుదలకు టైం ఉంది.
అయినా అప్పుడే చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.సెన్సార్ బోర్డు నుండి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అయితే ఏ సినిమాకు అయినా కూడా సెన్సార్ బోర్డు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అంటూ ప్రచారం జరుగుతుంది.అందువల్ల ఈ చిత్రం ఫలితం ఏంటీ అనేది పాజిటివ్ రెస్పాన్స్‌ను బట్టి చెప్పలేం అంటున్నారు.
విజేత చిత్రంకు సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్‌లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఆ టీజర్ మరియు ట్రైలర్‌లను చూస్తుంటే సినిమా తండ్రి, కొడుకుల మద్య జరిగే కథగా అనిపిస్తుంది.
తన తండ్రి బాధ్యతలను నెత్తికి ఎత్తుకుని, వాటిని ఎలా జయించాడు, హీరో ఎలా విజేత అయ్యాడు అనే కథను ఈ చిత్రంలో దర్శకుడు చూపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.టీజర్‌లో చూస్తుంటే కళ్యాణ్ నటన పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉందనిపిస్తుంది.
డైలాగ్ డెలవరీలో కూడా మార్పు రావాలి.ఇక సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని లోపాలు లభిస్తాయో చూడాలి.
సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.మరి కళ్యాణ్ కెరీర్ ఎలా ఉంటుందనేది కూడా అప్పుడే తెలుస్తుందేమో చూడాలి.