కల్కి మూవీకి 32వ రోజు అన్ని వేల టికెట్లు తెగాయట.. ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్న హీరో ఉన్నారా?

ప్రభాస్ , నాగ్ అశ్విన్( Prabhas, Nag Ashwin ) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ( Kalki 2898 AD Movie ) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి లాభాలను అందించింది.

కల్కి మూవీ 32వ రోజు ఏకంగా 63 వేల టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

సినిమా విడుదలై నెల రోజులు అవుతున్నా ఈ రేంజ్ లో టికెట్లు అమ్ముడవుతున్నాయంటే ప్రభాస్ రేంజ్ ఏంటో సులువుగా అర్థమవుతుందని చెప్పవచ్చు.ప్రభాస్ కు మాస్ ప్రేక్షకుల్లో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

కల్కి సినిమా నిర్మాతలకు ఊహించని రేంజ్ లో లాభాలను అందిస్తోంది.ప్రభాస్ సినిమాలు మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండటం కొసమెరుపు.

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.

Advertisement

కొత్త తరహా కథాంశాలకు ఓటు వేస్తున్న ప్రభాస్ సినిమా సినిమాకు భిన్నమైన జానర్లను ఎంచుకుంటూ సినిమాలు సక్సెస్ సాధించే విధంగా అడుగులు వేస్తున్నారు.ప్రభాస్ సినిమాల కథ, కథనం కొత్తగా ఉంటున్నాయి.ఇతర హీరోలతో పోల్చి చూస్తే ప్రభాస్ సక్సెస్ రేట్ సైతం పెరుగుతోందనే సంగతి తెలిసిందే.

మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా ప్రభాస్ అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.

కల్కి సినిమా కలెక్షన్లతో నిర్మాతలకు మాత్రం పంట పండినట్లేనని చెప్పవచ్చు. కల్కి సీక్వెల్( Sequel to Kalki ) కు సంబంధించిన అప్ డేట్స్ కోసం మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కల్కి సీక్వెల్ ఎప్పుడు విడుదలైనా ఫ్యాన్స్ కు ఆ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కల్కి సీక్వెల్ ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉండనుందని ఈ సినిమాలో ట్విస్టులు సైతం వేరే లెవెల్ లో ఉంటాయని భోగట్టా.

నన్ను క్షమించండి..యానిమల్ లాంటి సినిమా మరోసారి చెయ్యను : రణబీర్ కపూర్
Advertisement

తాజా వార్తలు