ఈ మధ్య కాలంలో భారీ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా లీక్స్ వస్తున్నాయి.మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎవరో ఒకరి ద్వారా లీక్ అవుతూనే ఉంది.
మన టాలీవుడ్ లో పాన్ ఇండియన్ వ్యాప్తంగా తెరకెక్కుతున్న చాలా సినిమాల నుండి ఫోటోలు, వీడియోలు లీక్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఒక్కొక్కరిగా కరీనా చర్యలకు పూనుకుంటున్నారు.
ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’( Game Changer )నుండి కూడా లీక్స్ కాగా మేకర్స్ ఈ విషయంలో కేసు ఫైల్ చేసి కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసారు.ఇక అదే బాటలో కల్కి కూడా నిలుస్తుంది.గేమ్ ఛేంజర్ కంటే ఒక అడుగు ముందుకు వేసి ఆడియెన్స్ ను హెచ్చరిస్తూ మేకర్స్ ఒక ప్రకటన జారీ చేసారు.ఆ పోస్ట్ లో ఏముందంటే…
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె ( Deepika Padukone )హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ”కల్కి 2898 AD”.
( Kalki 2898 AD ) పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకుని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా నుండి ఏదైనా లీక్ అయితే కఠిన చర్యలు తప్పవట.
ఎటువంటి సన్నివేశాలు, సంగీతం, ఫుటేజ్, స్టిల్స్, ఫోటోలు, న్యూస్ వంటివి ఎవరైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తే లేదంటే లీక్ చేయడం చేస్తే సైబర్ క్రైం చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అంటూ ఆడియెన్స్ కు హెచ్చరిక ఇస్తూ నోటీసు వాసిలారు.ఇది మంచి పరిణామం అని ఎవరో ఒకరు ముందు అడుగు వేస్తేనే ఇలాంటి లీక్స్ రాకుండా ఉంటాయని అంటున్నారు.