టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 12వ తేదీ విడుదల అయ్యి మొదట్లో మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ తర్వాత మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒకరిని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పాలి.ముఖ్యంగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన కళావతి పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంది.
సిద్ధ్ శ్రీరామ్ ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించారు.అయితే ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్లేస్ లో నిలిచింది.ఈ పాట మరోసారి సరికొత్త రికార్డుని సృష్టించి వార్తల్లో నిలిచింది.ఈ ఏడాది అత్యధికంగా వ్యూస్, లైక్స్ సాధించిన పాటగా కళావతి సాంగ్ రికార్డు సృష్టించింది.ఈ పాటకు 237 మిలియన్ వ్యూస్ రాగా 2.5 లైక్స్ సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇలా ఈ పాట ఇంటర్నెట్ సెన్సేషన్ గా నిలవడమే కాకుండా వివిధ ఆడియోస్ వేదికలు, యాప్స్ లో టాప్ సాంగ్ లిస్టులో కూడా చేరిపోయింది.మొత్తానికి కళావతి సాంగ్ ఇలా సరికొత్త రికార్డులను సృష్టించడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బిజీ అయ్యారు.అయితే ఈపాటికి చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమా మహేష్ బాబు తల్లిదండ్రులు చనిపోవడం వల్ల షూటింగుకు బ్రేక్ ఇచ్చారు.







