సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరోయిన్లకు లేదా హీరోలకు మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడినప్పుడు వారికి ఎన్నో సినిమా అవకాశాలు మాత్రమే కాకుండా, ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశాలు కూడా వస్తాయి.ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోహీరోయిన్లు కమర్షియల్ యాడ్స్ చేస్తూ పెద్ద మొత్తంలోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు.
ఇదివరకు హీరోయిన్లు ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా షాపింగ్ మాల్స్ జువెలరీ వంటివాటి కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు.ఇప్పుడు కాస్త ట్రెండ్ మారింది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇదివరకే రకుల్ ప్రీతిసింగ్, పూజా హెగ్డే, రెజీనా కసాండ్రా వంటి ముద్దుగుమ్మలు ఏకంగా మద్యం బాటిల్ ముందు పెట్టుకొని మందు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరించారు.అయితే ఈ లిస్టులో ఇదివరకే కాజల్ అగర్వాల్ చేరిపోయింది.
ఇలా ఎంతో మంది అభిమానులు ఉన్న ఈ ముద్దుగుమ్మలు ఈ విధమైనటువంటి బ్రాండ్లకు ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది యువతను తప్పుదోవపట్టించే అవకాశాలు ఉన్నాయి.కనుక ఈ విధమైనటువంటి యాడ్స్ చేసినందుకుగాను పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి యాడ్స్ ద్వారా సమాజంలో యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలని భావిస్తున్నారు అంటూ ఎంతో మంది కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ మరోసారి తన భర్తతో కలిసి మద్యం బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ మందును ప్రమోట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి మద్యం బాటిల్ ముందు పెట్టుకొని ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేస్తూ మన పార్ట్నర్స్ సాయంత్రం ఇలా పెగ్గు కలుపుతూ మన పక్కనే ఉంటే వీకెండ్ అలా గడిచి పోతుంది కదా అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.
అయితే ఈ మద్యం కేవలం 25 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే తాగాలని నియమాన్ని కూడా చెప్పుకొచ్చింది.ఇలా కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ఏంటి కాజల్ ఇప్పటివరకు సినిమాలలో నువ్వు సంపాదించిన డబ్బు సరిపోవడం లేదా? మళ్లీ ఇప్పుడు ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.అదేవిధంగా మరికొందరు కూడా ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ సమాజానికి ఏం సందేశం అందించాలని భావిస్తున్నారు.ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మీలాంటి సెలబ్రిటీలు సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలను ప్రజలకు తెలిసేటట్టు ఎంతో హుందాగా వ్యవహరించాలి కానీ ఇలా మద్యం బాటిల్ ముందు పెట్టుకొని తాగమని చెప్పడం ఏంటి అసహ్యంగా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.