ఆ హీరోతో పనిచేయడం చాలా ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన కాజల్!

అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి తెలియని వారంటూ ఉండరు.లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.

 Kajal Aggarwal Loves To Work With That Hero Details, Kajal ,lakshmi Kalyanam Mov-TeluguStop.com

తెలుగు తమిళ కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.కాజల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తు వరుస అవకాశాలు అందుకుంటుంది.

కొంతకాలం క్రితం తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో ఈ అమ్మడు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది.

చివరిసారిగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నటించిన కాజల్ బిడ్డ పుట్టిన మూడు నెలలకె మళ్లీ సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది.ఈ క్రమంలో కాజల్ కి భారతీయుడు 2 సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.అందువల్ల ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తూ సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదిస్తుంది.

అంతేకాకుండా తన భర్త బిజినెస్ కి కూడా సపోర్టింగ్ గా నిలుస్తుంది.

Telugu Indian, Kajal, Kajalagarwal, Kajalaggarwal, Salman Khan, Shah Rukh Khan-M

ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ లో నటించిన కాజల్ ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది.ఈ యాడ్ లో భాగంగా రాపిడ్ ఫైర్ సెషన్‌ను ఎదుర్కొంది కాజల్.ఈ క్రమంలో మీకు కట్ చాయ్ ఇష్టమా? ఫిల్టర్ కాఫీ ఇష్టమా? అని కాజల్ ని అడగగా… కట్ చాయ్ అంటే ఇష్టమని సమధానం చెప్పేసింది.ఇక మరోక సందర్భంలో సల్మాన్ ఖాన్‌తో అడ్వెంచర్లు చేస్తావా? షారుఖ్ ఖాన్‌తో రొమాంటిక్ డేట్‌కు వెళ్తావా? అని ప్రశ్న అడగగా… సల్మాన్ ఖాన్‌తో అడ్వెంచర్లు చేస్తాను అని చాలా తెలివిగా సమధానం చెప్పి తన మనసులో మాట బయట పెట్టింది.ఇలా కాజల్ అగర్వాల్ చెప్పిన ఈ సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube