కాజల్ అగర్వాల్ హనీమూన్ కు వెళ్ళిన హోటల్ గురించి మీకు తెలుసా?

ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు.

సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ చందమామ గత ఏడాది అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును ముంబై తాజ్ హోటల్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం అనంతరం హనీమూన్ కోసం ఈ జంట మాల్దీవులకు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.వీరి మాల్దీవులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

అయితే ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళిన హోటల్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.పెళ్లయిన తర్వాత ఈ జంట సుమారు 20 రోజుల పాటు మాల్దీవులలో ద మురా అనే ఫైవ్ స్టార్ హోటల్ లో దిగారు.

ఈ హోటల్ కు ఓ ప్రత్యేకత ఉంది.ప్రపంచంలోనే నీటి అడుగున నిర్మించిన తొలి హోటల్ ఇదేనని చెప్పవచ్చు.

Advertisement

ఈ జంట హనీమూన్ కోసం ఈ హోటల్ కి వెళ్లగా ఇది బాగా పాపులర్ అయింది.మాల్దీవులలో రంగాలి ఐలాండ్ లో రెండంతస్తులలో నిర్మించిన ఈ హోటల్ కింది అంతస్తు దాదాపు 16 అడుగుల లోతు సముద్రంలో ఉంటుంది.

ఇక్కడికి వెళ్లేవారు సముద్ర అందాలను, అందులో ఉండే జలచరాలను వీక్షిస్తూ ఎంతో ఎంజాయ్ చేయవచ్చు.మొత్తం అద్దాలతో నిర్మితమై ఉన్న ఈ హోటల్ అడుగు భాగంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఇంత అందమైన హోటల్ లో ఒక రోజు రాత్రి ఉండాలి అంటే దాదాపు 37 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఇంత అందమైన హోటల్ నిర్మాణం కోసం సుమారు రూ.110 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.ఈ హోటల్లో దిగడం టూరిస్టులకు ఎన్నో సౌకర్యాలతో అందుబాటులో ఉండటం వల్ల ఈ హోటల్లో బస చేసేవారు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అయితే ఇక్కడికి హనీమూన్ వెళ్ళిన ఈ జంటకు మాత్రం సదుపాయాలన్నీ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పొందారు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

మాల్దీవులలో పర్యాటక ప్రదేశాలలో పెద్ద ఆకర్షణగా నిలిచే ఈ హోటల్ మరెంతో మంది పర్యాటకులను ఆకర్షించడం కోసం ఒక వినూత్న ప్రయత్నం చేసింది.ఇందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ లో భారీగా ఫాలోవర్స్ ఉన్న వారికి ఎన్నో ఆఫర్లను ప్రకటించింది.10మిలియన్ ఫాలోవర్స్ కంటే ఎక్కువ ఉన్న వారు కేవలం మన బట్టలను ఒకటి సర్దుకుని వెళ్తే చాలు అన్నీ ఉచితంగానే పొందవచ్చు.ఈ సందర్భంగానే కాజల్ అగర్వాల్ కు17.3 మిలియన్ ఫాలోవర్స్ ఉండడంతో ఒక హోటల్ వీరికి ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది.ఇందులో భాగంగానే ఇక్కడ వారికి అన్ని ఉచితంగా కల్పించింది.

Advertisement

కానీ ఈ జంట చేయాల్సింది మాత్రం ఒక్కటే ఈ హోటల్ పరిధిలో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయాలి.ఈ విధంగా కాజల్ అగర్వాల్ తన హనీమూన్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎంతో ఆకర్షణగా నిలిచారని చెప్పవచ్చు.

తాజా వార్తలు