టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు.ఈమె స్టార్ హీరోల నుండి టైర్ 2 హీరోల వరకు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఈమె స్టార్ హీరోలందరితో నటించిన తర్వాత ఇక సీనియర్ హీరోలతో కూడా ఆడిపాడింది.ఈమె కళ్యాణ్ రామ్ తో చేసిన లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో ఈమె నటన పరంగా మెప్పించింది.ఇక ఆ తర్వాత ఈమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది మాత్రం మగధీర అనే చెప్పాలి.ఈ సినిమా తర్వాత కాజల్ కెరీర్ జెట్ స్పీడ్ గా దూసుకు పోయింది.వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత ఈమె ఇటీవలే గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగిస్తూ వస్తుంది.

ఈ తరుణంలోనే కాజల్ ప్రెగ్నెంట్ కావడం కుమారుడికి జన్మనివ్వడం వంటివి జరిగి పోయాయి.ఆ తర్వాత కాజల్ కొద్దీ రోజులు ఇంటికి పరిమితం అయినా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేసింది.ఈ మధ్య ఈమె వరుసగా అవకాశాలను అందుకుంటూ అందరికి షాక్ ఇస్తుంది.
పెళ్లి అయ్యి కుమారుడు ఉన్నప్పటికీ ఈమెకు ఈ రేంజ్ లో అవకాశాలు రావడం మిగతా హీరోయిన్ లకు షాకింగ్ గా ఉంది అనే చెప్పాలి.

ప్రెజెంట్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంది.ఈమె ఖాతాలో ఇప్పటికే చాలా సినిమాలు చేరిపోయాయి.కమల్ హాసన్ తో ఇండియన్ 2 చేస్తూనే బాలయ్య అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లో ఆఫర్ అందుకుంది.
అలాగే బాలీవుడ్ లో ఉమా సినిమా, కోలీవుడ్ లో కరుంగాపియం, పారిస్ పారిస్, ఘోస్టీ వంటి సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.మరి ఈ సినిమాల్లో రెండు సూపర్ హిట్స్ అయినా కాజల్ మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయం.







