టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్( kajal agarwal ) పెళ్లి పిల్లల తర్వాత సినిమా లకు దూరం అవుతుందని అంతా భావించారు.కానీ అనూహ్యంగా సినిమాల్లో ఆమె వరుసగా నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుచుతోంది.
ఇప్పటికే భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )తో పాటు మరి కొన్ని సినిమా లతో వచ్చింది.ఆ సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
అందుకే కాజల్ అగర్వాల్ తో సినిమా లను రూపొందించేందుకు ప్రముఖ దర్శకులు ముందుకు వస్తున్నాయి.హీరో లు ముఖ్యంగా స్టార్ హీరోలు ఆమె తో సినిమా లకు ఆసక్తి చూపడం లేదు.

కానీ కచ్చితంగా ఆమె తో ఒక్క సారి అయినా నటించాలని టైర్ 2 హీరో లు ఆసక్తిని కనబర్చుతూ ఉన్నారు.మొత్తానికి కాజల్ అగర్వాల్ లేడీ ఓరియంటెడ్ సినిమా లతో పాటు, హీరో లకు జోడీ గా నటించే అవకాశాలు కూడా దక్కించుకుంటూ ఉంది.కనుక ముందు ముందు ఈ అమ్మడి నుంచి మంచి సినిమా లు వస్తాయని అంతా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ అమ్మడి తో కొత్త దర్శకుడు రూపొందించబోతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా( Lady oriented movie , ) కు ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ ఎత్తున బడ్జెట్ ను పెట్టేందుకు సిద్ధం అన్నట్లుగా ప్రకటించినట్లుగా సమాచారం అందుతోంది.

కాజల్ కు దాదాపుగా మూడు కోట్ల పారితోషికం ఇవ్వడం తో పాటు, రూ.50 కోట్ల బడ్జెట్ ను సినిమా పై ఖర్చు చేస్తారట.వీఎఫ్‌ఎక్స్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చాలా ప్రత్యేకంగా కనిపించబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.కథ కు ఓకే చెప్పిన కాజల్ అగర్వాల్ నిర్మాణ సంస్థ తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో ప్రారంభం అవ్వబోతుంది.వచ్చే ఏడాది ప్రథమార్థం లో సినిమా షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది చివరి వరకు సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.