అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ప్రస్తుతం కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతున్నారు.ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో నాగ్ 99వ సినిమా తెరకెక్కుతోంది.
ప్రసన్న కుమార్ రచయితగా పని చేసిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి.నాగ్ ప్రసన్న కుమార్ కాంబినేషన్ సినిమా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
అయితే కాదంబరి కిరణ్( Kadambari Kiran ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
నా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఫ్లాప్ తర్వాత నేను ఎలా బ్రతకాలో అర్థం కాలేదని ఆయన అన్నారు.
ఇండస్ట్రీలో నుంచి పారిపోవాలని అనుకున్నా పారిపోలేనని కాదంబరి కిరణ్ చెప్పుకొచ్చారు.ఈనాడులో నేను ఉద్యోగం చేసేవాడినని నేను టీవీ సీరియల్ లో కనిపించడంతో నాకు మెమో ఇచ్చారని ఆయన తెలిపారు.
ప్రతి కొత్త ఛానల్ లో నేను సీరియల్ ప్రొడ్యూస్ చేశానని కాదంబరి కిరణ్ అన్నారు.
నేను వాచ్ మేన్ అని ఈ ఇండస్ట్రీలోని గుడ్, బ్యాడ్ నాకు తెలుసని ఆయన అన్నారు.ఆరోజు నేను ఒంటరి అని ఆయన కామెంట్లు చేశారు.నాకు ఇష్టం లేదంటే స్పాట్ లో ఇష్టం లేదని చెబుతానని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు.
ఆ తర్వాత రోజుల్లో నేను అందరినీ డార్లింగ్ అని పిలిచేవాడినని ఆయన తెలిపారు.నా విధిరాత వల్లే నాగార్జునతో సినిమా చేయలేకపోయానని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు.
రమ్యకృష్ణతో, సిమ్రాన్ తో సినిమాలను ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదని ఆయన కామెంట్లు చేశారు.నేను ఎన్నో ప్రాజెక్ట్ లను ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదని కాదంబరి కిరణ్ వెల్లడించారు.నాగార్జున గారు ఏఎన్నార్ ను( Akkineni Nageswara Rao ) యాంకరింగ్ కు ఒప్పించాలని భాష తెలియకుండా చెప్పగా పళ్లు రాలగొడతాడని అన్నానని కాదంబరి కిరణ్ తెలిపారు.