కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నటించిన ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో జ్యోతిక ( Jyothika ) ఒకరు.ఈమె ఎన్నో అద్భుతమైన తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇక సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక సినిమాలకు దూరమయ్యారు అయితే చాలాకాలం తర్వాత ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతాన్( Saithaan ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో జ్యోతిక ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జ్యోతిక తన భర్త సూర్య ( Suriya )సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడమే కాకుండా తన భర్త చేసే సినిమాలపై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ తన భర్త సూర్య ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమా స్క్రిప్టులను ఎంపిక చేసుకుంటారని ఈమె తెలియజేశారు.ఆ విషయంలో నేను చాలా గర్వపడతానని తెలిపారు.

సూర్య సినిమాలు ఎప్పుడు కూడా మహిళా పాత్రలను కించపరిచే విధంగా ఉండవని, వారి క్యారెక్టర్ మరింత ఉన్నతంగా ఉండేలాగే జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు.కథ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా మహిళా పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న ఆయన పెద్దగా పట్టించుకోరు అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చి మంచి సక్సెస్ అందుకున్నటువంటి జై భీమ్ ( Jai Bheem ) సినిమా సాక్ష్యం అంటూ ఈ సందర్భంగా జ్యోతిక తన భర్త సూర్య సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక సూర్య తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.







