ఈరోజు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు.ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర గవర్నర్ మంత్రులు హాజరయ్యారు.
కర్ణాటక హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా పనిచేసిన సతీష్ చంద్రశర్మ తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళ సై..సతీష్ చంద్ర శర్మ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులతో పాటు స్పీకర్ అదేరీతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జబల్ పూర్ లోని సెంట్రల్ స్కూల్ లో ప్రాథమిక విద్య, 1981లో బిఎస్పి డిగ్రీ పట్టా.చంద్రశర్మ.విద్యార్థి దశలో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కి కూడా ఎంపిక కావడం జరిగింది.1984 లో ఎల్ ఎల్ బి పూర్తి చేసి మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు.రాజ్ భవన్ లో.జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.