జూనియర్ ఎన్టీఆర్ ను 'సీనియర్ 'ఎన్టీఆర్' దగ్గరికి 'హరికృష్ణ' తీసుకెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర సంఘటన ఇదే.!

హరికృష్ణ గారికి అటు తండ్రిపై ఎంత గౌరవం ఉందొ.ఇటు కొడుకుపై కూడా అంతే ప్రేమ ఉంది.

గతంలో ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకలో హరికృష్ణ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.ఆ సభలో ఆయన మాట్లాడుతూ ‘‘నా పెద్ద కుమారుడి పేరు జానకీరామ్‌.

రెండో బిడ్డ కల్యాణ్‌రామ్‌.ఈ రెండు పేర్లూ మా నాన్నగారు పెట్టినవి.

ఎందుకంటే.మా అన్నదమ్ములు ఏడుగురికి కృష్ణలు పెట్టడం అయ్యింది.

Advertisement

మాకు నలుగురు అక్కచెళ్లల్లు.వాళ్లందిరికీ ‘ఈశ్వరి’ వచ్చేలా పేర్లు పెట్టారు.

నా బిడ్డల తరం వచ్చినప్పుడు నాన్నగారి దగ్గరకు వెళ్లి.మీరే పేరు పెట్టాలని అడిగా.

"తరం మారింది నాన్నా! ఇప్పుడు జాన్‌.అంటూ ఏవేవో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి.మీ ఇష్టం" అన్నారు.

నేను "లేదు.మీరే పేరు పెట్టాలి’ అన్నాను.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest

పెద్దవాళ్లు ఇద్దరికీ ఆయనే పేర్లు పెట్టారు.జూనియర్‌ బాబు (చిన్న ఎన్టీఆర్‌)కి మాత్రం ముందు నేనే పెట్టా.

Advertisement

తారకరామ్‌ అని! ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రీకరణ సమయంలో నాన్నగారు ‘ఏం చేస్తున్నాడు మూడోవాడు.ఒకసారి తీసుకురా!’ అన్నారు.

తీసుకువెళ్లా.‘నీ పేరేమిటి?’ అని బాబుని అడిగారు.

‘తాతగారూ.నా పేరు తారకరామ్‌.డాడీ పెట్టారు’ అని చెప్పాడు.

వెంటనే ‘నో! నీది నా అంశ.నా పేరు నీకుండాలి’ అన్నారు.నా మూడో అబ్బాయికి నందమూరి తారకరామారావు అని పేరు పెట్టి, ఆయన పేరుని ఆయనే దానం చేశారు.

ప్రేక్షకులకి తెలియని మరో విషయం ఏంటంటే.‘విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌లో జూనియర్‌ బాబు భరతుడి వేషం వేశాడు.

తన తాతగారితో కలిసి నటించాడు’’.

తాజా వార్తలు