నా మూడ్ బాగోకపోతే ఆ సినిమా చూస్తాను.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Junior Ntr Shocking Comments About Vishwak Sen Movie Details Here , Junior Ntr , Tollywood, Das Ka Dhamki , Ee Nagaraniki Emaindi , Vishwak Sen , Tollywood

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior ntr ) విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ( Das Ka Dhamki > మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే.ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Junior Ntr Shocking Comments About Vishwak Sen Movie Details Here , Junior Nt-TeluguStop.com

విశ్వక్ సేన్ మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేనని విశ్వక్ నాకంటే ఎక్కువ మాట్లాడతాడని తారక్ పేర్కొన్నారు.నా మూడ్ బాగోకపోతే నేను చూసే సినిమాలలో ఈ నగరానికి ఏమైంది( Ee Nagaraniki Emaindi ) మూవీ కూడా ఒకటని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.

ఆ మూవీలో విశ్వక్ కామెడీ చేయకుండా నవ్విస్తాడని ఎంటర్టైన్ చేస్తూనే లోపల బాధను దాచుకుంటాడని అలా నటించడం కష్టమని ఎన్టీఆర్ తెలిపారు.డైరెక్టర్ గా కూడా విశ్వక్ సేన్ టాలెంటెడ్ అని అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదని తారక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

యాటిట్యూడ్ తో మాట్లాడే విశ్వక్ సేన్ అంత సాఫ్ట్ క్యారెక్టర్ లో నటించడం చూసి ఆశ్చర్యపోయానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

హిట్ సినిమా చూసి ఆశ్చర్యపోయానని ఆ సినిమాలో విశ్వక్ సేన్( Vishwak Sen ) బ్యాలెన్డ్ గా నటించాడని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.దాస్ కా ధమ్కీ తర్వాత విశ్వక్ సేన్ డైరెక్షన్ మానేయాలని కోరుకుంటున్నానని కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి అతను డైరెక్షన్ మానేయాలని తారక్ చెప్పుకొచ్చారు.ఈ సినిమాకు ఉన్నదంతా పెట్టేశా నువ్వు ఈవెంట్ కు రావాలి అని విశ్వక్ సేన్ చెబుతుంటే బాధేసిందని ఎన్టీఆర్ అన్నారు.

సినిమా అంటే విశ్వక్ సేన్ కు ఎంత ఇష్టమో అప్పుడు అర్థమైందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడానికి ఈ సినిమాకు కష్టపడిన వాళ్లతో పాటు ఆడియన్స్ కూడా కారణమని ఎన్టీఆర్ తెలిపారు.ఎన్టీఆర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Video : Junior Ntr Shocking Comments About Vishwak Sen Movie Details Here , Junior Ntr , Tollywood, Das Ka Dhamki , Ee Nagaraniki Emaindi , Vishwak Sen , Tollywood #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube