యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.
ఆర్ మూవీ విడుదలై దాదాపుగా పది నెలలైనా ఈ సినిమా సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ నిజంగా పులితో ఫైట్ చేయాల్సి వస్తే మాత్రం పారిపోతానని తారక్ కామెంట్లు చేశారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలలో భాగంగా మేము రావడం ఆనందంగా ఉందని తారక్ వెల్లడించడం గమనార్హం.
ఆర్.
ఆర్.ఆర్ మూవీ కోసం ఫిట్ నెస్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.కొన్ని నెలల పాటు ఒకే తరహా శరీరాకృతిని కొనసాగించానని తారక్ చెప్పుకొచ్చారు.రోజులో 3000 కేలరీలు పెంచుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.ఒకరోజులో ఏడుసార్లు భోజనం చేశానని తారక్ చెప్పుకొచ్చారు.16 నుంచి 17 నెలలు కష్టపడి కొమురం భీమ్ లుక్ లోకి వచ్చానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

నా ఆలోచనల ప్రకారం చరణ్ నీరులాంటి వ్యక్తి అని తారక్ చెప్పుకొచ్చారు.చరణ్ ను నేను సముద్రంతో పోలుస్తానని చరణ్ తో మంచి అనుబంధం ఉంటే మాత్రమే చరణ్ గొప్పదనం అర్థమవుతుందని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.బ్రిడ్జ్ కూలే సమయంలో బాలుడిని కాపాడే సీన్ షూట్ 2018లో జరిగిందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.ఆస్కార్ నామినేషన్స్ విషయంలో రాజకీయాలు జరిగాయని నేను చెప్పనని తారక్ తెలిపారు.

ప్యానెల్ సభ్యుల నిర్ణయాన్ని తప్పు పట్టాలని నేను అనుకోవడం లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.ఈ సినిమా మమ్మల్ని గర్వపడేలా చేసిందని తారక్ కామెంట్లు చేశారు.తారక్ తర్వాత సినిమాలు ప్రశాంత్ నీల్, కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.ఈ రెండు సినిమాలు రికార్డులు బ్రేక్ చేసేలా ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా తారక్ భవిష్యత్తు ప్రణాళిక ఉందని సమాచారం.







