ఈ నెల 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి కాగా తారక్ కు సంబంధించిన బ్యానర్లను బాలయ్య( Balakrishna ) ఆదేశాల మేరకు తొలగించడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను బాలయ్య తొలగించాలని ఆదేశించగా కొంత సమయం తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్( NTR Fans ) ఆ బ్యానర్లను తీసుకెళ్లి యథా స్థానంలో ఉంచారు.
తాము కానీ తమ హీరో కానీ ఎలాంటి తప్పు చేయలేదని బ్యానర్లను తొలగించాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు.
ఎన్నికలయ్యే వరకు బాలయ్య సంయమనం పాటించకపోతే ఇబ్బందులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు, లోకేశ్ సైతం జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేయడానికి ఇష్టపడటం లేదు.ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి స్వాగతం సుస్వాగతం అని ఉండటం వల్లే తొలగించారని ప్రచారం జరుగుతుండగా గతంలో కూడా అలాంటి బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఫ్యాన్స్ రెండుగా విడిపోవడం వల్ల నష్టం ఇద్దరికీ ఉంటుందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.పొలిటికల్ కార్యక్రమాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అడుగులు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర( Devara Movie ) షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

అయోధ్య రామ మందిరం( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందని అయితే వేర్వేరు కారణాల వల్ల తారక్ హాజరు కావడం లేదని తెలుస్తోంది.బాలయ్య, తారక్ తమ మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారక్ కు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా తారక్ సినిమాలకు మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.వరుస సినిమాలు తారక్ క్రేజ్ ను అమాంతం పెంచేస్తున్నాయి.







