బాలయ్యతో విబేధాలపై ఎన్టీఆర్ క్లారిటీ ఇదే.. ఆయన తండ్రిలాంటి వ్యక్తంటూ?

టాలీవుడ్ నందమూరి నరసింహం బాలయ్య బాబు( Balayya Babu ) అలాగే నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ విభేదాలకు స్వస్తి పలికేలా చేసేందుకు ఎంతోమంది పెద్దలు ప్రయత్నించారుకానీ కుదర్లేదు.

సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సమయంలో ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తారక్, కల్యాణ్ రామ్ తాత తారకరాముడికి నివాళులు కూడా అర్పించారు.ఆ సమయంలో అభిమానులు తారక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తర్వాత తండ్రికి నివాళి అర్పించేందుకు వచ్చి తారక్ కు సంబంధించిన ఫ్లెక్సీలు తీయించాలంటూ ఆదేశించారని వార్తలు వచ్చాయి.కానీ బాలయ్య చెప్పిన విషయాన్ని కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయని తర్వాత అభిమానులు వెల్లడించారు.అదే విధంగా ఇదే విషయంపై ఎన్టీఆర్ కు( NTR ) అలాగే కళ్యాణ్ రామ్ కు( Kalyan Ram ) కూడా కొన్ని సందర్భాలలో ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇది ఇలా ఉంటే ఇటీవలే ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఒక సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ ను విలేకరులు బాలయ్యతో విభేదాలపై అడిగారు.

Advertisement

దీంతో తారక్ మాట్లాడుతూ తనకు బాలయ్యతో విభేదాలేంటండి.ఎటువంటి సమస్యలు తమ మధ్య లేవని, సమస్య అనేదే లేదని తేల్చి చెప్పారు.సమస్య ఏమిటనేది తనకు కూడా తెలియదని అన్నారు తారక్.

నా తండ్రి హరికృష్ణకు ఆయన సోదరుడు, నాకు తండ్రి లాంటి వారు, అటువంటప్పుడు ఆయనతో తనకు విభేదాలెందుకు ఉంటాయి అని ఎదురు ప్రశ్నించారు తారక్.ఏ విషయాన్ని తాను మనసులో పెట్టుకోనని, ఏ విషయంలోనైనా తాను ఓపెన్ గా ఉంటానని తారక్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ బాలయ్య బాబు మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు