టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది.చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కస్టడీ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనల విన్న ఏసీబీ కోర్టు తీర్పును వాయిదా వేసింది.ఈ మేరకు రేపు తీర్పును వెల్లడిస్తామని ప్రకటించింది.
అయితే నిన్న సుదీర్ఘ వాదనలు అనంతరం తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.అయితే హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదా వేశారు.
చంద్రబాబు రిమాండ్ ముగుస్తున్న క్రమంలో కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.ఆర్డర్ ఇప్పుడు ఇస్తే రేపు క్వాష్ పిటిషన్ బట్టి చర్యలు తీసుకుంటామని సీఐడీ పేర్కొంది.
అయితే దీనిపై రేపే తీర్పును వెలువరిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ విచారణలో భాగంగా మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు గానూ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.