NTR : వామ్మో.. ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే?

సిని ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల సంపాదన ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వాళ్ళు అంత సంపాదిస్తున్న కూడా బయటకు మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు.

 Jr Ntr Watch Cost Will Shock Everyone Details Inside-TeluguStop.com

కానీ వాళ్ళు ధరించే కొన్ని కాస్ట్యూమ్స్( Costumes ) అయినా చాలా హై రేంజ్ లో ఉంటాయని చెప్పాలి.వాళ్ళు కేవలం ఒక షర్ట్, ప్యాంట్, షూ, వాచ్ మాత్రమే ధరిస్తుంటారు.

పైగా అవి చూడటానికి కూడా చాలా సింపుల్ గా అనిపిస్తూ ఉంటాయి.కానీ వాటి ధర చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోతాయని చెప్పాలి.

ఇప్పుడు ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర కూడా అంతే దిమ్మతిరిగిపోతుంది.ఇంతకు ఆయన ధరించిన వాచ్ ధర ఎంతనో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న ఎన్టీఆర్ ( NTR )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్నవయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత హీరోగా ఎదిగి కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు.

తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు.చాలా వరకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్.మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగాడు.

Telugu Koratala Siva, Ntr Watch Cost, Ntr Watch, Tollywood-Movie

మంచి హోదాలో ఉన్న సమయంలో లక్ష్మీ ప్రణతిని( Lakshmi Pranati ) పెళ్లి చేసుకొని ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చాడు.అలా ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు కెరీర్ పరంగా ఫుల్ బిజీ లైఫ్ లో గడుపుతున్నాడు.ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకొని ఇతర భాషకు చెందిన ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది.ప్రస్తుతం ఆయన దేవర అనే మరో సినిమాలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా మ్యాడ్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కొంతవరకు మంచి టాకే అందుకుంది.ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ భాగంలో హీరో సంగీత్ శోభన్ ఎన్టీఆర్ ను కలవడం జరిగింది.

Telugu Koratala Siva, Ntr Watch Cost, Ntr Watch, Tollywood-Movie

దీంతో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే కొంతమంది చూపులు ఎన్టీఆర్ ధరించిన వాచ్ పై పడ్డాయి.దీంతో ఆ వాచ్ ను చూసి ఫిదా అయినా జనాలు అది ఏ బ్రాండ్ కు సంబంధించిందో అని తెగ సెర్చ్ చేసినట్లు కనిపించింది.దీంతో ఆ వాచ్ MB&F కంపెనీకి చెందినదని తెలిసింది.ఇక దాని విలువ 1.66కోట్ల రూపాయలని వార్త బాగా వైరల్ అవుతుంది.దీంతో దాని ధర చూసినవాళ్లంతా మరింత షాక్ అవుతున్నారు.ఈ డబ్బులతో ఒక సినిమా కూడా తీయొచ్చు అని జనాలు అనుకుంటున్నారు.నిజానికి ఎన్టీఆర్ తను ధరించే కాస్ట్యూమ్స్ విషయంలో ప్రతి ఒక్కటి రిచ్ గా ఉండేలా తీసుకుంటాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube