Jr Ntr Devara : దేవరలో ఇద్దరు కాదు ముగ్గురు ఎన్టీఆర్ లు కనిపిస్తారా.. జై లవకుశ మ్యాజిక్ రిపీట్ కానుందా?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ దేవర.ప్రస్తుతం ఎన్టీఆర్( Jr ntr ) ఈ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Jr Ntr Playing Triple Role In Devara-TeluguStop.com

కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

Telugu Devara, Jai Lava Kusa, Janhvi Kapoor, Jr Ntr, Saif Ali Khan, Tollywood, T

ఆ వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.అయితే రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌ లో కనిపిస్తారని ఇన్నాళ్లు టాక్ నడిచింది.కానీ తాజాగా ఇప్పుడు మరో కొత్త రూమర్ వినిపిస్తోంది.దేవర లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.కానీ, దేవర టీమ్ నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్‌ పాత్రలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు.ఒకవేళ, ఎన్టీఆర్ మూడు పాత్రల వార్త నిజమైతే ఇది నిజంగా తారక్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

Telugu Devara, Jai Lava Kusa, Janhvi Kapoor, Jr Ntr, Saif Ali Khan, Tollywood, T

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల.మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

ఒకవేళ ప్రస్తుతం వార్తలో వినిపిస్తున్నట్టుగా ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తే జై లవకుశ మ్యాజిక్ రిపీట్ అయినట్లే అని చెప్పవచ్చు.కాగా జై లవకుశ( Jai Lava Kusa ) సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube