మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.ఈయన ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.
ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా రాగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి నటుడుగా ఎన్టీఆర్ ను మరో మెట్టు ఎక్కించింది.
మరి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎప్పుడో తన స్టైల్ మార్చేశాడు.
కానీ ఈ సినిమా అప్పుడు కరోనా కారణంగా స్టార్ట్ కాలేదు.దీంతో ఎన్టీఆర్ మధ్యలో ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ లో పాల్గొనాల్సి రాగా ఆ స్టైల్ ను మార్చేశాడు.
ఇక ఇప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది కాబట్టి తన కొత్త మేకోవర్ ను రెడీ చేసినట్టు సమాచారం.ఫ్రెష్ అండ్ స్టైలిష్ లుక్ లోకి మారబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా ఈ నెల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయితే వెంటనే రెగ్యురల్ షూట్ కూడా జరిగే అవకాశం ఉంది.అందుకే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త మేకోవర్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.చూడాలి మరి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏ లుక్ లో దర్శనం ఇస్తాడో.ఇక కొరటాల ఇటీవలే మెగా హీరోలతో ఆచార్య సినిమా తీసి ప్లాప్ ఎదుర్కొన్నాడు.
తన కెరీర్ లో మొదటిసారి ప్లాప్ అయ్యింది.దీంతో ఇప్పుడు మరింత పట్టుదలతో కొరటాల ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నాడు.







