జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి వారిలో జోర్దార్ సుజాత(Jordar Sujatha) ఒకరు ఈమె ఈ కార్యక్రమానికి రాకముందు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాని కంటే ముందుగా సుజాత జోర్దార్ వార్తలలో తెలంగాణ యాసలో గలగల చదివేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు.
ఇలా న్యూస్ రీడర్ గా ఉన్నటువంటి ఈమెకు బిగ్ బాస్(Bigg Boss) అవకాశం వచ్చింది.బిగ్ బాస్ కార్యక్రమంలో మరింత గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుజాత అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె మరొక జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ప్రేమలో పడి చివరికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఇలా పెళ్లి తర్వాత సుజాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈమె వెబ్ సిరీస్ చేయడమే కాకుండా మరోవైపు రాకింగ్ రాకేష్ తో( Rocking Rakesh ) కలిసి జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.అదేవిధంగా ఈమె సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ యాంకర్ గా కూడా మారిపోయారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ఇద్దరు కూడా కెరియర్ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సుజాత తరచూ వెకేషన్ లోకి వెళ్లడం వెకేషన్ కి సంబంధించినటువంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతుంది.ఈ క్రమంలోనే ఈమె ఇటీవల వెకేషన్ వెళ్ళిన సమయంలో అక్కడ పులి( Tiger ) దగ్గరకు వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా దానిని టచ్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు.ఇలా భయపడుతూనే ఈమె పులి దగ్గరకు వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చారు.అయితే చివరిలో మాత్రం పులి ఏకంగా తోకతో జోర్దార్ సుజాతకు ఒకటి ఇవ్వడంతో ఆమె బిత్తర పోయారు.

ఇలా పులి దగ్గరకు వెళ్లి ఈమె దానిని తాకే ప్రయత్నం చేయడమే కాకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఇలాంటి ఫోటోషూట్ ల కోసం వాటికి మత్తు ఇస్తున్నారు.డబ్బు సంపాదించడం కోసం జంతువులకు మత్తు ఇచ్చి బలి చేస్తున్నారంటూ కొందరు ఈ ఫోటోలపై కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం అంత ఓవరాక్షన్ దేనికి పులికి ఆల్రెడీ మత్తు ఇచ్చి ఉంది కదా అంటూ ఈ వీడియో పై వివిధ రకాలుగా నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.







