వర్మకు దిమ్మతిరిగే పంచ్.. ఆర్జీవీ టైటిల్‌తో అదరగొట్టిన జొన్నవిత్తుల

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి వాతావరణం సృష్టించాడో అందరికీ తెలిసిందే.

వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు తెలుగు జనాల్లో హాట్ టాపిక్‌గా మారి పరోక్షంగా ఆంధ్ర రాజకీయాలపై ప్రభావం చూపించాయని ఓ టాక్.

అయితే ఇలాంటి సినిమాలతో వివాదం సృష్టించిన వర్మ, ఓ టీవీ డిబేట్ షో ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుతో నువ్వా నేనా అనే స్థాయిలో వాగ్వివాదం జరిపాడు.ఆ సందర్భంగా వర్మకు త్వరలో ఫ్యూజులు లేపే సినిమాను చేస్తానంటూ జొన్నవిత్తుల శపథం చేశారు.

అనుకున్నట్లుగానే ఆయన ఆర్జీవీ పేరుతో ఓ సినిమాను ప్రారంభించారు.తాజాగా ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

‘రోజూ గిల్లే వాడు’ అనే అదిరిపోయే టైటిల్‌తో ప్రేక్షకుల్లో అంతే అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశారు.మొత్తానికి అందరినీ గిల్లే రామ్ గోపాల్ వర్మను జొన్నవిత్తుల గిల్లుతున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Advertisement

కాగా ఈ పోస్టర్‌ను ఆర్జీవీ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు