జాన్సన్ అండ్ జాన్సన్ పిల్లల కోసం కరోనా టీకా..!

జాన్సన్ అండ్ జాన్సన్ నుండి పిల్లల కోసం కరోనా టీకా సిద్ధం చేస్తుంది.

ఇప్పటివరకు 18 ప్లస్ ఉన్న వారికే కరోనా వ్యాక్సిన్ వేయగా జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రం 12 నుండి 17 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్ల కోసం వ్యాక్సిన్ ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

ఇప్పటికే వారి కోసం సిద్ధం చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ చేసేందుకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు దరఖాస్తు చేసింది.జాన్సన్ అండ్ జాన్సన్ పెద్దల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ లో ఉంది.

దాని ప్రభావం 85 శాతంగా ఉన్నట్టు తేలింది.ఈ నెల మొదట్లోనే జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్రానికి దరఖాస్తు చేయగా అనుమతి లభించింది.

దేశ ప్రజలకు మరో టీకా అందుబాటులోకి వచ్చింది.రెండు నెలల్లో పిల్లల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తాయని భారత్ బయోటెక్ వెల్లడించింది.

Advertisement

అయితే జాన్సన్ అండ్ జాన్సన్ నుండి కూడా పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్ త్వరగానే వచ్చేలా ఉంది.మిగతా కంపెనీలు కూడా పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్ తయారు చేసే పనిలోనే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు