ఏపీలో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా టిడిపి( TDP ) జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.సీట్ల సర్దుబాటు వ్యవహారంపైనే పూర్తిగా కసరత్తు చేస్తున్నాయి .
ఏ నియోజకవర్గం లో ఎవరిని పోటీకి దింపాలి ? జనసేనకు ఎన్ని సీట్లు ఏ ఏ స్థానాల్లో కేటాయించాలి అనే విషయం పైన గత కొద్ది రోజులుగా టిడిపి ఆధినేత చంద్రబాబుకు( Chandrababu) కసరత్తు చేస్తున్నారు.రెండు పార్టీలు సీట్ల ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే బిజెపి చంద్రబాబు ను ఢిల్లీకి పిలవడం, పొత్తులపై చర్చించడం వంటివి చేసుకోవడంతో జనసేన, టిడిపి( Janasena, TDP ) అభ్యర్థుల ప్రకటన నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే.జనసేన పొత్తులో భాగంగా టిడిపి ఇచ్చిన సీట్లు మాత్రమే తీసుకుని సరిపెట్టుకోవడం సరికాదని ,సీఎం పదవి విషయంలోనూ షేరింగ్ ఉండాల్సిందేనని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామయ్య ( Hari Ramaiah ) హడావిడి చేస్తున్నారు.ఈ మేరకు పవన్ కు లేఖలు రాస్తూ సంచలనం రేపుతున్నారు.గత కొద్ది రోజులుగా జోగయ్య చేస్తున్న వ్యాఖ్యలు టిడిపి , జనసేనకు ఇబ్బందికరంగా మారాయి.ప్రస్తుతం జోగయ్య వ్యవహారం చూస్తుంటే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి సహకరిస్తున్నారా లేక ఇబ్బంది సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా అనేది జనసేన వర్గాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.జోగయ్య.
సీనియర్ పొలిటిషన్ .ఆయనకు ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది .అయితే పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న చదువుతో జోగాయ్యే స్వయంగా జనసేన ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి.ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది ప్రకటిస్తూ లిస్టును విడుదల చేయడం జనసేనకు తలనొప్పిగా మారింది.

పలనా సీటులో పలానా వారు పోటీ చేయాలంటూ ఆయన ప్రకటించడంతో పవన్ సైతం ఈ వ్యవహారంపై ఆగ్రహంగానే ఉన్నారట.అయితే జాబు ఇంతగా జనసేన విషయంలో కంగారు పడడానికి కారణాలు ఉన్నాయి.పవన్ ను ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయం ఎక్కువగా కనిపిస్తుంది .టిడిపితో జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సీఎం సీటు విషయంలో కచ్చితంగా షేరింగ్ తీసుకోవాల్సిందేననే అభిప్రాయంతో ఉన్నారు .ఈ విషయంలో పవన్ ఎక్కడ రాజీ పడిపోతారో అన్న భయం కనిపిస్తుంది.అందుకే ముందుగానే ఈ విషయంపై క్లారిటీ తీసుకోవాలని పవన్ పై ఒత్తిడి చేస్తూ , ఈ విధంగా లేఖలతో రచ్చ చేస్తున్నారు.
అయితే పవన్ వద్ద ఈ విషయాలను నేరుగా చెప్పే అవకాశం ఉన్నా .ఇలా లేఖలతో ఇబ్బంది పెట్టడం సరికాదనే అభిప్రాయాలు జనసేన వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.జోగయ్య సూచనలు పవన్ కు , జనసేనకు మంచి చేసేవే అయినా, ఈ విధంగా బహిరంగంగా ఆయన లేఖలు విడుదల చేయడం మాత్రం ఇబ్బందికరంగా మారింది.