ప్రపంచ వ్యాప్తంగా ఒమెక్రాన్ టెన్షన్ మొదలయ్యింది.ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత వేరియంట్స్ ఎక్కువగా ప్రభావం చూపింది అమెరికా పై కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ సైతం ఒమెక్రాన్ ప్రమాదకరమైన వైరస్ అని, గత వేరియంట్స్ తో పోల్చితే ఎంతో జాగ్రత్త వహించాలంటూ కొన్ని రోజుల క్రితం చేసిన కామెంట్స్ అమెరికన్స్ ను మరింత ఆందోళనలోకి నేట్టేశాయి.
ఈ నేపద్యంలో అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ అమెరికన్స్ కు ధైర్యం చెప్తూ కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం మన వద్దనున్న వ్యాక్సిన్లు అన్నీ ఒమెక్రాన్ నుంచీ మనల్ని కాపాడుతాయని, అయితే మొదటి, రెండవ డోస్ కంటే కూడా బూస్టర్ డోస్ వేసుకున్న వారు మాత్రం సేఫ్ సైడ్ లో ఉన్నారని.
తాజాగా అందుకు సంభందించిన కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా బిడెన్ ప్రకటించారు.రెండు డోస్ లు తీసుకున్న వారు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే ఒమెక్రాన్ పై వ్యాక్సిన్ లు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో కొన్ని ఫైబర్ , బయోటెక్ కంపెనీలు పలు రకాల పరిశోధనలు చేశాయి వారు ఇచ్చిన రిపోర్ట్ ల ప్రకారం.

రెండు డోసులు తీసుకున్న వారి రక్త నమూనాలు, అలాగే బూస్టర్ డోస్ తీసుకున్న వారి బ్లడ్ సీరం నమూనాలు సేకరించి వారిపై పరిశోధనలు చేయగా, బూస్టర్ డోస్ తీసుకున్న వారి శరీరంలో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉండటం గమనించారు.రెండు డోసులు తీసుకున్న వారిలో వ్యాధి వస్తే పోరాడగలిగే సామర్ధ్యం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.ఇలా మొత్తం 20 మందిపై పరిశోధనలు చేసిన బృందం బూస్టర్ డోస్ తీసుకున్న వారు ఒమెక్రాన్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.