అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) పబ్లిక్ అపీరియన్సెస్ ఇచ్చినప్పుడు కింద పడటమో, లేదంటే నిద్రపోవడమో చేస్తూ విమర్శలు పాలవుతున్నారు.తాజాగా ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) నాయకులతో గ్రూప్ ఫోటో సందర్భంగా జో బైడెన్ గందరగోళంగా, దిక్కుతోచని స్థితిలో చూస్తూ ఉండిపోయారు.
దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను గురువారం, 2023, నవంబర్ 16న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో( San Francisco, California ) జరిగిన APEC సమ్మిట్ 2023లో తీయడం జరిగింది.
గ్రూప్ ఫోటో కోసం వేదికపైకి వచ్చిన ఇతర ప్రపంచ నాయకులతో కలిసి బైడెన్ నిల్చున్నారు.అదే సమయంలో తన ముక్కును రుద్దుకోవడం, చుట్టూ చూస్తున్నట్లు వీడియోలో కనిపించింది.అంతేకాకుండా వెరైటీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇతర నాయకుల ముఖాలను కూడా స్కాన్ చేస్తాడు.ఫొటో సెషన్ తర్వాత, బైడెన్ స్పీచ్ ఇవ్వడానికి మైక్రోఫోన్ ( Microphone )వద్దకు పరిగెత్తారు.
తర్వాత వేదిక పేరును తప్పుగా ఉచ్చరించడం ద్వారా మరోసారి షాక్ ఇచ్చారు.
అతను దాని సరైన పేరు ‘మాస్కోన్ సెంటర్’కి బదులుగా “మార్కోన్ సెంటర్” ( Marcone Center )అని పిలిచారు.అతను వేదిక పరిమాణాన్ని తన రాష్ట్రంతో పోల్చారు, “మార్కోన్ సెంటర్ నా రాష్ట్రం అంత పెద్దది.” అని అన్నారు.బైడెన్ వింతగా ప్రవర్తించిన తీరుతో పాటు ఇలా తప్పులు మాట్లాడటం వల్ల సాటి అమెరికన్లుగా తమ సిగ్గుపడుతున్నామని కొందరు కామెంట్లు చేస్తున్నారు.APEC సమ్మిట్ 2023 నవంబర్ 11న ప్రారంభమై నవంబర్ 17న ముగిసింది.
దీనికి 21 మంది ప్రపంచ నాయకులు, 30,000 మందికి పైగా హాజరయ్యారు.