వచ్చే సంవత్సరం అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలో నేను ఉన్నాను అంటే నేను ఉన్నాను అంటూ ఎంతో మంది పోటీ కి సిద్దం అవుతున్నారు.ఇప్పటికే డెమోక్రాటిక్ పార్టీ తరుపునుంచీ భారత సంతతి మహిళలు ఇద్దరు బరిలోకి దిగి ప్రచారంలో దూసుకుపోతున్న సమయంలో తాజాగా ఇదే పార్టీ నుంచీ నేను కూడా సిద్దంగా ఉన్నాను అంటూ అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించుకున్నారు.
76 ఏళ్ల వయసున్న ఆయన తనకి తానుగా అమెరికా ఎన్నికల్లో నేను సైతం అంటూ, 2020 లో ట్రంప్ కి గట్టి పోటీ ఇచ్చేది నేనే అంటూ సామాజిక మాధ్యమంలో ఓ విడియో ని పోస్ట్ చేశారు.అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోసారి పోటీచేసినట్టయితే తన చేతిలో ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
డెమోక్రాటిక్ పార్టీ సీనియర్ నేత అయిన జోబిడెన్ కి అపారమైన రాజకీయ అనుభవం ఉంది.అమెరికా సెనేట్ లో 36 ఏళ్ళు సేవలు అందించారరు బిడెన్.
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎనిమిదేండ్ల పాటు అమెరికా ఉపాధ్యక్షుడుగా పనిచేశారు.







