ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్న జియో... ఎక్కడంటే?

బీపీ గ్రూప్ నకు చెందిన జియో-బీపీ ( jio-BP )మరియు పిరమల్ రియాల్టీ కంపెనీలు సంయుక్తంగా ఆరోగ్యవంతమైన వాతావారణాన్ని సృష్టించేందుకు కొత్త కొత్త మార్గాలను అనుసరించనున్నాయి.

కస్టమర్ల అభివృద్ధి అంచనాలకు అనుగుణంగా స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నాయి.

ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.ఈ జాయింట్ వెంచర్ ద్వారా వరల్డ్-క్లాస్ ఈవీ ఛార్జింగ్ సొల్యుషన్స్ ను ముంబాయి మెట్రోపాలిటన్ రీజియన్లలోని పిరమల్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ ను వరల్డ్ క్లాస్ సదుపాయాలతో ఏర్పాటు చేయనున్నామని తాజాగా ప్రకటించారు.

ఈ ఇరు కంపెనీలు సంయుక్తంగా పనిచేసే క్రమంలో మొదటగా జియో-బీపీ థానేలోని పిరమిల్ వైకుంత్ లో( Piramil Vaikunth ) ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది.చాలా రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ల ద్వారా జియో-బీపీ భారత దేశంలోనే అతి పెద్ద ఛార్జింగ్ హబ్ లను నిర్మించే సంస్థగా అవతరించింది అనడంలో అతిశయోక్తి లేదు.ఇప్పటికే వందలాది ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది.

చాలా సిటీలు, మేజర్ హైవేల పక్కన వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.ఇలా నివాస ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఉత్సాహం చూపుతారు.

Advertisement

భారత దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల( Electric vehicles ) వినియోగదారులకు అత్యంత సులువుగా, నాణ్యమైన ఛార్జింగ్ సేవలను అందించడమే లక్ష్యంగా జియో-బీపీ పని చేస్తోందని ఈ సందర్భంగా ఆ సంస్థ పేర్కొంది.ఇకపోతే పిరమల్ గ్రూప్ కు చెందిన ఈ సంస్థ 2012లో స్థాపించడం జరిగింది.ఈ సంస్థ కస్టమర్ల కోసం బెస్ట్ డిజైన్, క్వాలిటీ, సేఫ్టీ ఇవ్వడమే లక్ష్యంగా రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ను అభివృద్ధి చేస్తోంది.

ఇపుడు జియో-బీపీ.మరియు పిరమల్ గ్రూప్ సంయుక్తంగా ఈ జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేశాయి.

Advertisement

తాజా వార్తలు