భారతదేశం రంగంలోకి జియో సంస్థ అడుగు పెట్టినప్పుడు నుండి టెలికాం రంగంలో పెను మార్పులు సంభవించాయి.అప్పటివరకు మొబైల్ డేటా కావాలంటే వందలకు వందలు ఖర్చు పెడితే కాని దొరకని రోజుల నుండి నేడు కేవలం ఒక జిబి డేటా ఆరు నుంచి పది రూపాయలు మాత్రమే ఖర్చు చేసే రోజులకు తీసుకవచ్చింది.
అంతలా జియో సంస్థ టెలికాం రంగాన్ని మొత్తం ఒక ఊపు ఊపేస్తుంది.
ఇకపోతే మొబైల్ రంగంలో కూడా పెను సంచలనం లకు దారితీసేలా తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.
ఎవరైనా ఫోన్ కొనాలని భావిస్తున్నారా…? అయితే ఇప్పుడు రిలయన్స్ జియో భారీ ఆఫర్ ని ప్రకటించింది.జియో ఫోన్ 2 ను కేవలం రూ.141 చెల్లిస్తే చాలు… ఆ ఫోన్ మన సొంతం చేసుకోవచ్చు.అయితే ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని మాత్రం ఈఎంఐ లలో మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఈ ఆఫర్ ను జియో సంస్థ కృష్ణాష్టమి సందర్భంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది.ఇక ఈ జియో ఫోన్ 2 పూర్తి వివరాలు చూస్తే… ఈ ఫోన్ 2.4 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది.కైఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఈ ఫోన్ పని చేస్తుంది.
అయితే ఇందులో కేవలం 512mb ర్యామ్, 4gb ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ను మెమరీ కార్డు ద్వారా 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
ఇక ఈ ఫోన్ కెమెరా విషయం చూస్తే… మొబైల్ వెనకవైపు 2 మెగా పిక్సల్ కెమెరా ఉంచగా, ముందువైపు వీజీఏ కెమెరాను పొందుపరిచారు.అలాగే బ్యాటరీ సామర్థ్యం 2000 mah గా ఉంది.

ఇక ఈ ఫోన్ ధర విషయం చూస్తే రూ.2,999 గా కంపెనీ నిర్ణయించింది.అయితే ప్రస్తుతం రిలయన్స్ సంస్థ అందిస్తున్న ఆఫర్ ప్రకారం కేవలం నెలకు రూ.141 చెల్లించి ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.ఇక ఈ ఫోన్ సంబంధించిన పూర్తి వివరాలు జియో రిటైల్ స్టోర్స్ లో, అలాగే జియో వెబ్ సైట్ లో కూడా పొందొచ్చు.ఇంకెందుకు ఆలస్యం… ఎవరికైతే తక్కువ మొత్తంలో మొబైల్ ఫోన్ అవసరం ఉందో వెంటనే వారు ఆర్డర్ చేసేయండి.