జార్ఖండ్ ప్రభుత్వాన్ని( Jharkhand Govt ) అప్రతిష్ట పాలు చేయాలని ఈడీ ప్రయత్నిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్( CM Hemant Soren ) అన్నారు.రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసి కూడా ఈడీ( ED ) ఎందుకు హడావుడీ చేస్తుందని ప్రశ్నించారు.
ఈ మేరకు ఈడీకి హేమంత్ సోరెన్ లేఖ రాశారు.ఈనెల 31వ తేదీలోపు విచారించాలన్న పట్టుదల ఏంటని సోరెన్ లేఖలో ప్రశ్నించారు.
అయితే ఇప్పటికే సీఎం సోరెన్ కారు ఈడీ అధికారులు జప్తు చేశారు.ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు ఆయన లేకపోయినా సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే కారుతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.కాగా హేమంత్ సోరెన్ కు ఈడీ ఇప్పటికే ఏడుసార్లు సమన్లు జారీ చేయగా ఆయన గైర్హాజరయ్యారు.ఈ నేపథ్యంలోనే ఈడీ సమన్లను హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో( Supreme Court ) సవాల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు సీఎంవో ఈడీ కార్యాలయానికి పంపిన ఈ-మెయిల్ లో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు విచారించవచ్చని తెలిపారు.
అయితే ప్రభుత్వ భూముల యాజమాన్య హక్కుల మార్పిడి కేసులో ఈడీ హేమంత్ సోరెన్ కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.