సుదీర్ఘ లాక్ డౌన్ ఏర్పాటు చేసి కరోనాని నియంత్రించే ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్న లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చింది.ప్రభుత్వంపై పెరిగిపోతున్న ఆర్దికబారంని కంట్రోల్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకొని రెడ్ జోన్ ల వరకు లాక్ డౌన్ అమలు చేస్తూ ఆరెంజ్, గ్రీన్ జోన్ లకి మినహాయింపులు ఇచ్చారు.
ఇదే సమయంలో ఇండియాలో ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే మద్యం అమ్మకాలకి అనుమతులు ఇచ్చారు.ఒక్కసారిగా మద్యం అమ్మకాలు మొదలు కావడంతో మందుబాబులు లాక్ డౌన్ నిబంధనలు పక్కన పెట్టి మద్యం కోసం ఎగబడ్డారు.
ఏపీ, కర్నాటక రాష్ట్రాలలో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.ఈ మద్యం దుకాణాలు ఓపెన్ చేయడం వలన ఇన్ని రోజులు చేసిన లాక్ డౌన్ వృధా అయినట్లు కనిపిస్తుంది.
దీనిపై ఇప్పటికే ఏపీలో ప్రతిపక్షాలు అధికార వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.తాజాగా ఈ విషయంపై మాజీ జేడీ, వివి లక్ష్మినారాయణ కూడా స్పందించారు.
లాక్‌డౌన్ సడలింపులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలి.మద్యం దుకాణాలను తెరవడం కరోనా విజృంభణకు కారణమవుతుంది.
శరీరంలో రోగ నిరోధకతను తగ్గిస్తుంది.గృహ హింస పెరుగుతుంది, పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి అని లక్ష్మీ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ కోసం ఇతర మార్గాలను చూసుకోవాలి.ప్రజల జీవితాలను ప్రమాదంలో పెట్టొద్దు అని లక్ష్మీ నారాయణ సూచించారు.