జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి గత ఎన్నికల ముందు చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు.ఒకానొక దశలో ఆయన గెలుపు ఖాయం అనుకున్నా గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు.
జేడీ పోటీ వల్ల వైజాగ్‌లో టీడీపీ ఓడిపోయింది అన్నది మాత్రం నిజం.ఆ తర్వాత కొద్ది నెలలకే ఆయన జనసేన నుంచి బయటకు రావడంతో పాటు పవన్‌పై విమర్శలు కూడా చేశారు.
పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడమే ఆయనకు అభ్యంతరంగా మారింది.దీనిపై పవన్ సైతం అప్పట్లో ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.
అయితే ఇప్పుడు ఆయన మనసు మార్చుకుని తిరిగి జనసేన వైపు వెళుతున్నారా ? అంటే అవుననే కామెంట్లే వస్తున్నాయి.తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో జనసేన మంచి ఫలితాలు రాబట్టింది.
ఈ సందర్భంగా ఆయన తన తాజా ఇంటర్వ్యూలో జనసేన గురించి పాజిటివ్ వ్యాఖ్యలు చేశారు.అసలు జేడీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఎవ్వరూ ఊహించలేదు.
మీరు మళ్లీ జనసేన లోకి వెళతారా ? అని ప్రశ్నించగా దీనిపై తాను పునరాలోచిస్తానని లక్ష్మీనారాయణ పేర్కొనడం రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారింది.

జేడీ తిరిగి పార్టీలోకి వస్తానంటే అటు పవన్ కళ్యాణ్ కూడా కాదనరు.అయితే ఆయన పార్టీ వీడే ముందు చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.వాళ్లు జేడీ వద్దని కామెంట్లు పెడుతున్నారు.
అయితే జేడీ జనసేన నుంచి బయటకు వెళ్లాక మరో పార్టీలో చేరలేదు ఏ పార్టీ గురించి పాజిటివ్‌గా మాట్లాడలేదు.అయితే జేడీ తాను జనసేన విషయంలో తప్పు చేశానా అన్న భావనకు వచ్చారా ? అన్నది ఆయన కామెంట్లు చూస్తేనే అర్థమవుతోంది.దీంతో ఆయన తిరిగి పార్టీలోకి వస్తే ఇటు పవన్ కూడా ఇగోలకు పోకుండా ఉంటే ఇద్దరికి మేలు జరుగుతుంది.