ఈ మాట అన్న నాయకుడు టీడీపీ అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి.ఎపీకి ప్రత్యేక హోదా రాదని మొదటి నుంచి దివాకర్ రెడ్డి బల్ల గుద్ది చెబుతున్న సంగతి తెలిసిందే.
హోదా తప్పక వస్తుందని ఇతర పార్టీల నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నా దివాకర్ మొదటి నుంచి ఒక్కటే మాట మీద ఉన్నారు.హోదా పై శనివారం ఆయన మాట్లాడుతూ అది ఇవ్వకపోయినా మంచిదే అన్నారు.
అలాగని ఊరుకోలేదు.హోదా ఇవ్వడంలేదు కాబట్టి ఎక్కువ నిధులు ఇవ్వాలని అన్నారు.
ఎక్కువ నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.పనిలో పనిగా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడిని మరొకసారి పొగిడారు.
రాజధాని నిర్మాణం ఒక్క రోజులో పూర్తి కాదన్నారు.రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించడానికి చంద్రబాబు చాలా కష్ట పడుతున్నారని అన్నారు.
ఒకప్పుడు శత్రువైన బాబు ఇప్పుడు దివాకర్ రెడ్డికి దేవుడిలా కనబడుతున్నాడు.దివాకర్ మాటలను బట్టి చూస్తే ప్రత్యేక హోదా అక్కరలేదనే అభిప్రాయం టీడీపీ నాయకులందరిలో కలిగిందని అనుకోవచ్చు.
హోదా ఇవ్వక పోయినా డబ్బు ఎక్కువ ఇస్తే అదే పది వేలు.







