ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టిన వారిని మొదట ఈ ప్రపంచం పిచ్చివారి గా చూస్తుంది.అలాగే ఏదైనా ముందుచూపుతో చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పిన విషయం కూడా ఆ టైంలో కొంతమందికి నచ్చకపోవచ్చు.
అలాంటి ఒక సంఘటన నటి జయసుధ మరియు హీరో శోభన్ బాబు( Sobhan Bab ) విషయంలో జరిగింది.వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు.
శోభన్ బాబు గారు జయసుధ( Jayasudha ) కంటే చాలా సీనియర్ నటులు అతనిపై ఆమెకు ఎంతో విశ్వాసం ఉండేది ఆయన చెప్పినట్టుగానే జయసుధ వినేవారు.వారి మధ్య ఉన్న అనుబంధాన్ని జయసుద ఇటీవల ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేస్తూ అనేక ఆసక్తికరమైన సంఘటనలను పంచుకున్నారు.

శోభన్ బాబు చాలా ముందు చూపు కలిగిన వ్యక్తి అని మనందరికీ తెలిసిందే ఆయన అప్పట్లో ఎంతో మంది వద్దు అన్నా వినకుండా భూములపై పెట్టుబడి పెట్టి వాటిని వందల, వేల కోట్లకు ఆస్తులుగా పెంచుకున్నారు.ఇప్పుడైతే వాటి విలువ ఎంత ఉంటుందో చెప్పడం కూడా కష్టం.అలా కొన్ని కాలనీలకు కాలనీలే ఆయన పేరు ఉండేవి.ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.కానీ ఆయన తాను ఒక్కడే బాగుపడాలని ఇప్పుడు అనుకోలేదు తనతో పాటు నటించే నటీనటులకు కూడా ఎన్నో విలువైన సలహాలను ఇచ్చేవారట.ఆ క్రమంలోనే మురళీమోహన్( Murali Mohan ) లాంటి వ్యక్తి శోభన్ బాబు చెప్పాడు అనే కారణంతో భూమిపై ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం.

ఒకసారి జయసుధను అన్నావ్ నగర్ లో ఉన్న ఒక డంపింగ్ యార్డ్ కి తీసుకెళ్లి అక్కడ భూమిని కొనుక్కోమని చెప్పాడట అప్పుడు చనిపోయిన పందులు పడి ఉన్న ఆ స్థలాన్ని చూసి ఆ దుర్వాసన తట్టుకోలేక శోభన్ బాబు గారికి ఏమైనా పిచ్చి పట్టిందా ఇంత తెలివి తక్కువగా సలహా ఇచ్చారు అని అనుకున్న కానీ ఇప్పుడు అదే వందల కోట్లకు ఎకరం పలుకుతుంది.అది ఆయన ముందు చూపు అని ఆరోజు అర్థం చేసుకోలేని జయసుధ ఈరోజు తాను తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఎంతగానో బాధపడుతున్నారు.కేవలం జయసుధ మాత్రమే కాదు ఇలాంటి సంఘటనలు శోభన్ బాబుకు జీవితంలో ఎంతో మందితో ఉన్నాయి.