5గురు పిల్లలు ఉన్న తండ్రిని పెళ్ళి చేసుకున్న హీరోయిన్ జయంతి

సినిమాలో నటించే చాలామంది హీరోయిన్ల పరిస్థితి ఒకేలా ఉంటుంది.కొన్నాళ్లపాటు సినిమాలో నటించడం, ఆ తర్వాత ఎవరో ఒక పెద్ద మనిషి పంచన చేరడం, అతని రెండో పెళ్లి లేదా మూడో పెళ్లి వంటివి చేసుకోవడం, అతడి దాస్టికాన్ని కొన్ని రోజుల పాటు భరించడం, కొనాళ్ళ తర్వాత ఇక ఆ పెళ్లి వద్దు నాయనో అని ఆ బంధం నుంచి బయటపడడం, తిరిగి మరో వివాహం చేసుకోవడం లేదంటే డిప్రెషన్ కి గురవడం,ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి కనిపించకుండా వెళ్లిపోవడం, చివరికి కన్నుమూయడం.

 Jayanthi Marriage With Peketi Shivaram , Jayanthi , Jayanthi Marriage , Peketi S-TeluguStop.com

నాటి జయంతి నుంచి నేటి సమంత వరకు అందరు పరిస్థితి ఇదే.అవకాశాల కోసం, అండ కోసం ఒకరిని ఆశ్రయించి పెళ్లి చేసుకోవడం అనేది సినిమా ఇండస్ట్రీ లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంది.

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్ నటి జయంతి పెళ్లి రిసెప్షన్ ది.పేకేటి శివరాంని ఆమె రెండో పెళ్లి చేసుకుంది అప్పటికే అతడికి అయిదారుగురు పిల్లలు కూడా ఉన్నారు.జయంతికి అది మొదటి వివాహమే కొన్నాళ్ళ పాటు వీరి బంధం బాగానే ఉన్నా ఆ తర్వాత అతని నుంచి విడిపోయింది.వీరి పెళ్లి రిసెప్షన్ కి సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు తో సహా కలిసి హాజరయ్యారు.

విడాకుల తర్వాత ఆమె చందన నిర్మాత గిరిబాబు నీ పెళ్లాడింది.ఆ టైమ్ లో అతడికి ఇది రెండో వివాహమే.

ఈ పెళ్లి కూడా ఎక్కువ రోజులు నిలవలేదు.

మళ్లీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ విడాకులు ఇవ్వడం పరిపాటిగా మారింది హీరోయిన్స్ కి.అవకాశాల కోసం వారి పెళ్లిని అడ్డుగా పెట్టుకున్నారు అని నిందలు కూడా భరించాల్సి వచ్చింది.కానీ ఇప్పటి తరం చాలా బెటర్.

ఆక్రందించడం, అర్పించుకోవడం లాంటి భారీ డైలాగులు లేవు.ఇష్టమైతే కలిసుందాం లేదంటే విడిపోదాం అనే విధానంతోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

అందుకే విడిపోయాక జస్ట్ పక్క ఊరికి వెళ్ళినట్టు జస్ట్ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు హీరోయిన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube