యూపీఐ చెల్లింపుల‌కు ఈ- రూపీకి గ‌ల తేడాలివే...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డిజిటల్ రూపాయికి సంబంధించి మొదటి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి నెల రోజులు దాటింది.ఇది డిసెంబర్ 1, 2022న ప్రారంభిమ‌య్యింది.

 The Difference Between E Rupee And Upi Payments Is , Upi Payments, Reserve Bank-TeluguStop.com

అంతకుముందు నవంబర్ 1, 2022 న ఆర్‌బిఐ టోకు విభాగానికి డిజిటల్ రూపాయికి సంబంధించిన మొదటి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.అయితే డిజిటల్ రూపాయి స్వీకరణకు, విజయానికి మరికొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

గత నెలలో యూపీఐ మరియు నెట్ బ్యాంకింగ్ ఇ-రూపాయికి ప్రధాన సవాళ్లు అని పలువురు బ్యాంకర్లు ఎత్తి చూపారు.ఎందుకంటే వినియోగదారులు ఇప్పుడున్న మార‌క విదానాల‌తో సంతృప్తి చెందారు.

అటువంటి పరిస్థితిలో ప్రజలు ఆర్బీఐ యొక్క డిజిటల్ రూపాయిని స్వీకరించడానికి కొంత సమయం పట్టవచ్చంటున్నారు.అయితే ఈలోగా ఈ-రూపాయి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది.

డీమోనిటైజేషన్ జ‌రిగి సంవత్సరం గ‌డిచాక 2016లో ప్రవేశపెట్టబడిన యూపీఐ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది.ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులను ఈ-రూపాయిని కూడా ప్రయత్నించాల‌ని, స్వీకరించాల‌ని ప్రోత్సహిస్తోంది.

అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.ప్రస్తుత ప్రసిద్ధ చెల్లింపు యూపీఐకి ఇ-రూపాయి ఎలా భిన్నంగా ఉంటుందో వినియోగ‌దారులు తెలుసుకోవాలి.

Telugu Rupee, Net, Rbigovernor, Differencerupee, Upi-Latest News - Telugu

ఈ -రూపాయి చట్టపరమైన టెండర్.యూపీఐ అనేది చెల్లింపు మాధ్యమం. ఈ-రూపాయి మరియు యూపీఐ మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఏమిటంటే ఈ-రూపాయి అనేది డిజిటల్ రూపంలోని కరెన్సీ.డిజిటల్ లావాదేవీలను ప్రారంభించే చట్టబద్ధమైన టెండర్, అయితే యూపీఐ అనేది డిజిటల్‌గా లావాదేవీలు జరిగే ఒక వేదిక.

బ్యాంకులకు ఇ-రూపాయికి మధ్యవర్తి అవసరం లేదు.యూపీఐలో డిజిటల్ లావాదేవీలు తప్పనిసరిగా బ్యాంక్ ద్వారా లేదా నిఫ్ట్‌ లేదా ఇంటర్నెట్ ఆధారిత బ్యాంకింగ్ పద్ధతుల ద్వారా జరగాలి.

అయితే ఇ-రూపాయి న‌గ‌దు ఒక డిజిటల్ వాలెట్ నుండి మరొకదానికి బదిలీ చేయబడుతుంది.డిజిటల్ రూపాయి మరియు యూపీఐ మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆ మ‌ధ్య‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప‌లు వివ‌రాలు తెలిపారు.“ఏదైనా యూపీఐ లావాదేవీలో బ్యాంక్ మధ్యవర్తిత్వం ఉంటుంది.కానీ సీబీడీలో పేపర్ కరెన్సీ వలె, మీరు బ్యాంకుకు వెళ్లి కరెన్సీని తీసుకోవచ్చు.

దానిని మీ పర్సులో ఉంచవ‌చ్చు.మీరు షాప్‌కి వెళ్లి మీ వాలెట్‌తో చెల్లించ‌వ‌చ్చు.

అదేవిధంగా ఇక్కడ కూడా మీరు డిజిటల్ కరెన్సీని ఉపసంహరించుకోవచ్చు మరియు మీ మొబైల్‌లో ఉపయోగించగల మీ వాలెట్‌లో ఉంచుకోవచ్చు.మీరు ఎప్పుడు వెళ్లి దుకాణంలో లేదా మరొక వ్యక్తికి న‌గ‌దు చెల్లించ‌వ్చు.

అప్పుడు అది మీ వాలెట్ నుండి అతని వాలెట్‌కి వెళుతుంది.బ్యాంకు సంబంధిత రూటింగ్ లేదా మధ్యవర్తిత్వం అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టంచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube