జయమ్మ పంచాయతీ.. సుమ రెమ్యూనరేషన్ షాక్..!

స్మాల్ స్క్రీన్ స్టార్ యాంకర్ సుమ ఓ పక్క రియాలిటీ షోలు చేస్తూనే సినిమా ఈవెంట్లు చేస్తుంది.

స్టార్ సినిమా ఈవెంట్ అంటే సుమ హోస్ట్ గా ఉండాల్సిందే.

ఇదివరకు ఒకరోజు హోస్టింగ్ కి 1, 2 లక్షలు తీసుకునే సుమ ఇప్పుడు ఏకంగా ఐదు నుండి ఆరు లక్షల దాకా డిమాండ్ చేస్తుందని అంటున్నారు.అంత డిమాండ్ చేసినా సరే ఆమె అడిగినంత ఇచ్చి మరి ఆమెను తీసుకుంటున్నారు.

ఇదిలాఉంటే ఎన్నో ఏళ్ల తర్వాత సుమ మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద మెరవబోతుంది.ఆమె లీడ్ రోల్ లో జయమ్మ పంచాయతీ సినిమా వస్తుంది.

సినిమా కోసం సుమ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.దాదాపు ఓ మీడియం రేంజ్ హీరోయిన్ తీసుకుంటున్న 50 లక్షల పారితోషికం ఈ సినిమాకు సుమ తీసుకుందని అంటున్నారు.

Advertisement

అంతేకాదు సినిమాకు డేట్స్ కూడా ఆమె అనుకున్నట్టుగా ఇస్తుందట.మొత్తానికి సుమ క్రేజ్ తో జయమ్మ పంచాయతీ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

సినిమా ప్రచార చిత్రాలైతే మాత్రం సూపర్ బజ్ ఏర్పాటు చేస్తున్నాయి. సుమ జయమ్మ పంచాయతి హిట్ అయితే మాత్రం ఇక మీదట ఆమె కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తున్నట్టు టాక్.

Advertisement

తాజా వార్తలు