గత ఏడాది మంచి కామెడీతో విడుదలైన సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాకు డైరెక్టర్ అనుదీప్ కె.
వి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు అందుకున్నాడు.అంతేకాకుండా స్టార్ హీరోల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు.2016లో విడుదలైన పిట్టగోడ సినిమాతో తొలిసారిగా దర్శకత్వం వహించి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
కానీ ఈ సినిమా అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.
కానీ జాతి రత్నాలు సినిమాతో మాత్రం ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు అనుదీప్.ఇక అనుదీప్ తను చేసే కామెడీ తో మరింత పరిచయం పెంచుకున్నాడు.
ఇక ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొంటే మాత్రం ఆ ఇంటర్వ్యూ మొత్తం సందడిగా సాగుతుంది.ఎందుకంటే ఆయన చేసే జోక్స్ అలా ఉంటాయి కాబట్టి.
ఇక ఈయన గతం లో బుల్లితెర సుమ షోలో పాల్గొని ఆ షోలో చాలా రచ్చ చేశాడు.ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.
అప్పుడప్పుడు ఈయన చేసే పోస్టులు కూడా కామెడీగా అనిపిస్తాయి.ఇదిలా ఉంటే తాజాగా ఈయన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కు పెద్ద షాక్ ఇచ్చాడు.
ఇంతకు అసలు విషయం ఏంటంటే.ప్రస్తుతం రష్మిక మందన సీతారామం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
![Telugu Dulquer Salman, Jathirathnalu, Sitha Ramam, Tarun Basker, Tollywood-Movie Telugu Dulquer Salman, Jathirathnalu, Sitha Ramam, Tarun Basker, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/07/anudeep-kv-leaks-rashmika-mandanna-sitharamam-poster-detailsa.jpg )
హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.ఇక వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్, స్వప్నాదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది.ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ తదితరులు నటించారు.
దీంతో తాజాగా అనుదీప్ ఈ సినిమాలో నుండి రష్మిక మందనకు సంబంధించిన ఒక ఫోటోను రష్మిక కు షేర్ చేసుకుని ఇందులో మీరు చాలా క్యూట్ గా ఉన్నారండి అని అన్నాడు.అంతేకాకుండా మరో ఫోటో షేర్ చేసుకుంటూ.
ఈ వెదర్ లో మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ షేర్ చేసుకున్నాడు.దీంతో రష్మిక థాంక్స్ అని చెబుతూ ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది అని రష్మిక ప్రశ్నించింది.
![Telugu Dulquer Salman, Jathirathnalu, Sitha Ramam, Tarun Basker, Tollywood-Movie Telugu Dulquer Salman, Jathirathnalu, Sitha Ramam, Tarun Basker, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/07/anudeep-kv-leaks-rashmika-mandanna-sitharamam-poster-detailsas.jpg )
వెంటనే అనుదీప్ హా మేడం.ఈ ఫోటో నేను పంపలేదు నా అకౌంట్ హ్యాక్ అయింది అంటూ తిరిగి షాక్ ఇచ్చాడు.ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక మీమ్ బాగా వైరల్ అవ్వడంతో నెటిజన్లు అనుదీప్ కౌంటర్లకు బాగా నవ్వుకుంటున్నారు.రష్మిక కు బాగానే తగిలింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక అనుదీప్ తన దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఓ సినిమాను ఫిక్స్ చేశాడని గతంలో తెలిసింది.అంతేకాకుండా ఈ సినిమాకు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ను తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
ఇక రష్మిక మందనని హీరోయిన్ గా తీసుకోనున్నట్లు గతంలో బాగా వార్తలు వినిపించాయి.