బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు జెస్సీ ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా.. ప్రూఫ్స్ తో సహా?

మోడల్ జెస్సి.బిగ్ బాస్ హౌస్ కి రాకముందు వరకు ఈ పేరు చాలా మందికి తెలియదు.

కానీ బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత మోడల్ జెస్సీ అంటే ఎవరో అందరికీ తెలిసింది.ఇక బిగ్ బాస్ హౌస్ లో కొద్దిరోజులపాటు ఎంటర్టైన్ చేసిన ఆ తరువాత అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కాకుండానే వెళ్ళిపోయాడు.

ఇకపోతే మొదట్లో మోడల్ జెస్సీ బిగ్ బాస్ కు రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.బిగ్ బాస్ హౌస్ కి జెస్సీ ఎలా వచ్చారు అంటూ ప్రేక్షకులు ఆరాతీయగా.

రికమండేషన్ కంటెస్టెంట్ గా జెస్సీని తేల్చేశారు.బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడానికి జెస్సీ ఎదురు డబ్బులు ఇచ్చి మరి ఎంట్రీ ఇచ్చాడన్న వార్తలు వినిపించాయి.

Advertisement

అందుకోసం జెస్సీ దాదాపుగా 20 లక్షలకు పైగానే బిగ్ బాస్ నిర్వాహకులకు ముట్ట చెప్పాడు అంటూ రూమర్స్ పెద్దఎత్తున వినిపించాయి.సాధారణంగా అయితే బిగ్ బాస్ హౌస్ కి వచ్చే కంటెస్టెంట్ లకు రెమ్యూనరేషన్ ఇస్తారు.

కానీ జెస్సీ విషయంలో మొత్తం రివర్స్ అయ్యిందని వార్తలు వినిపించాయి.తాజాగా ఈ విషయాలపై జెస్సీ స్పందిస్తూ బయట వారు మాత్రమే కాదు హౌస్ లో వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి వచ్చాడని కామెంట్ చేశారు అని తెలిపాడు.

అయితే అలా అన్న వారికోసం నేను నా అకౌంట్ లో ఎన్ని డబ్బులున్నాయో చూపిస్తున్నా నా అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇస్తా నాకు ఉన్నది ఒకే ఒక్క అకౌంట్ అదే ఎస్బీఐ నా అకౌంట్‌లో ప్రస్తుతం 11 వేలు మాత్రమే ఉన్నాయి.బిగ్ బాస్ వాళ్లకి డబ్బులు అవసరం లేదు.వాళ్లు డబ్బులిచ్చి ఎప్పుడూ తీసుకోరు.

వాళ్లే డబ్బులు ఎదురిస్తారు.ఫైనాన్సియల్‌గా నేను చాలా వీక్.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

నాకు బ్యాగ్రౌండ్ ఏమీ లేదు.మా నాన్న గారు చనిపోయారు.

Advertisement

నేను నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తూ దాచుకున్న డబ్బులతో మోడలింగ్ నేర్చుకున్నాను.రూపాయి విలువ నాకు బాగా తెలుసు.

దేవుడు నా కష్టాన్ని చూసి.బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు.

బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చిన వెంటనే వాళ్లు నాకు రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు వెళ్లిపోదాం అనుకున్నా.వాళ్లే నాకు రెమ్యునరేషన్ ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు జెస్సీ.

తాజా వార్తలు