సింక్ అనేది ప్రజలు తమ చేతులు, ముఖం కడుక్కోవడానికి బాత్రూంలో లేదా టాయిలెట్ దగ్గర గోడకు ఉంటుంది.టాయిలెట్ అనేది ఒక వ్యక్తి మూత్ర విసర్జన లేదా మల విసర్జన చేసే స్థిరమైన ప్రాంతం.
దానికి అనుబంధంగా వ్యర్థాలను సెప్టిక్ ట్యాంక్‌లోకి పంపడానికి వీలుగా ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది.సింక్ మరియు ఫ్లష్ ట్యాంక్ రెండు పరస్పర విరుద్ధ అవసరాలకు ఉపయోగపడతాయి.
అందుకే వాటి డిజైన్లు కూడా వేరుగా ఉంటాయి.కానీ జపాన్‌లో, ఒక ప్రత్యేకమైన టాయిలెట్ ఆవిష్కరణ ఈ రెండింటినీ కలిపి ఒకేలా రూపొందించింది.
ప్రతి చిన్న ప్రాంతాన్ని ఉపయోగించుకునే కాంపాక్ట్ అపార్ట్‌మెంట్‌లకు జపాన్ దేశం ప్రసిద్ధి చెందింది.మీరు టోక్యోలోని తక్కువ అద్దె అపార్ట్‌మెంట్‌లోకి వెళితే, టీవీ, సోఫా, బెడ్, టాయిలెట్ సీటు ఉన్న ఒకే గదిని చూసి మీరు ఆశ్చర్యపోతారు.
లగ్జరీ కంటే లొకేషన్ సౌలభ్యానికి ప్రాధాన్యతనిచ్చే తక్కువ జీతాలతో ఈ రకమైన ఫ్లాట్‌లు ఉంటాయి.ఈ తరుణంలో జపాన్‌లో కొత్త టాయిలెట్ అందరినీ ఆకర్షిస్తోంది.ప్రస్తుతం వైరల్ అవుతున్న జపనీస్ టాయిలెట్ స్థలం వినియోగాన్ని తగ్గించడం లేదా ఒక వస్తువును దాని పూర్తి సామర్థ్యానికి ఉపయోగించడం కోసం ఒక చక్కని ఉదాహరణ.ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన ఫోటో టాయిలెట్ వెనుక ఫ్లష్‌కు జోడించబడిన చిన్న సింక్‌ని మనం చూడొచ్చు.
ఇది ప్రజలు ఫ్లష్‌పై సింక్‌లో చేతులు కడుక్కోవడానికి వీలుగా ఉంటుంది.ఆ మురికి నీటిని టాయిలెట్‌ను ఫ్లష్ చేయడానికి తిరిగి ఉపయోగించేందుకు అనుమతిస్తుంది.అనేక జపనీస్ టాయిలెట్లలో, హ్యాండ్ వాష్ సింక్ జతచేయబడి ఉంటుంది, తద్వారా మీరు మీ చేతులు కడుక్కోవచ్చు.
తదుపరి ఫ్లష్ కోసం నీటిని తిరిగి ఉపయోగించవచ్చు.జపాన్ ప్రతి సంవత్సరం లక్షలాది లీటర్ల నీటిని ఆదా చేస్తుందని ప్రత్యేకమైన టాయిలెట్ యొక్క ఫోటోతో పాటు ఫెసినేటింగ్ అనే ట్విట్టర్ పేజీ రాసింది.తెలివిగల ఆవిష్కరణ ఇంటర్నెట్‌ను ఎంతగానో ఆకట్టుకుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక వీటిని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆర్డర్ ఇస్తున్నారు.అయితే, సింక్ చాలా చిన్నదిగా ఉందని, చేతులు సరిగ్గా కడుక్కోలేమని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఐడియా బాగుంది కానీ డిజైన్ ఆచరణాత్మకంగా లేదని, వెన్ను సమస్య ఉంటే మీరు అంత దూరం వంగి చేతులు కడుక్కోలేరు” అని మరొకరు కామెంట్ చేశారు.