RRR: ఆర్ఆర్ఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా.. కుమారుడి కోసం ఏకంగా ఆర్ఆర్ఆర్ స్టోరీ బుక్ గిఫ్ట్ గా ఇచ్చిన తల్లి?

టాలీవుడ్ దశకు దీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా( RRR ) గురించి మనందరికీ తెలిసిందే.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ని షేర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

 Japanese Mom Creates Rrr Flip Book Her 7 Year Old Son-TeluguStop.com

ఇక ఈ సినిమా కలెక్షన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సినిమా విడుదల అయ్యి ఏడాది పూర్తవుతున్న కూడా ఇంకా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు.

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సంచలన విజయాన్ని సృష్టించింది.

కాగా ఈ సినిమా జపాన్ లో( Japan ) విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.గత ఏడాది అక్టోబర్ 21న జపాన్లో విడుదల అయింది.ఈ సినిమా రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సినిమా రికార్డును బద్దలు కొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే.

అంతేకాకుండా ఈ సినిమా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకి జపాన్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే సాక్ష్యం అని చెప్పవచ్చు.

తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.ఆ వీడియోలో జపాన్ కు చెందిన ఒక అభిమాని తన కుమారుడి కోసం అదిరిపోయే గిఫ్ట్ ని అందించింది.ఆర్ఆర్ఆర్ సినిమాని అర్థమయ్యే విధంగా ఒక తల్లి ఏకంగా సినిమా బొమ్మలతో కూడిన స్టోరీ బుక్ ని రూపొందించింది.కామిక్ బొమ్మల రూపంలో తయారుచేసిన ఆ బుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోని బట్టి చూస్తే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది అన్నది అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube