ఓస్! నల్లటి జెల్ పెన్ను( Blackest Gel Pen ) గురించి మాకు చెబుతారా? మేము ఎన్ని వాడలేదు! అనే అనుమానం మీలో మొదలైంది కదూ.కరక్టే, మీరు వాడే పెన్ను గురించి మనం ఇక్కడ మాట్లాడు కోవడం లేదండోయ్.
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్ను గురించే ఇపుడు చర్చ అంతా.అవును, మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్న పెన్ను ఈ ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నుగా రికార్డులు సృస్టించింది మరి.అవును, అయితే అది మనదేశానికి చెందినది కాదు.జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ( Mitsubishi ) తయారు చేసిన యూని-బాల్ వన్ సిరీస్ బ్లాక్ జెల్ పెన్ను.

ఇక దీనిని ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్( Guinness World Records ) తాజాగా ప్రకటించడంతో ఈ పెన్ను గురించి సోషల్ మీడియాలో చాలా జోరుగా చర్చలు నడుస్తున్నాయి.అయితే దీనిలోని ప్రత్యేకత యేమిటని మీకు అనుమానం కలుగవచ్చు.అక్కడికే వస్తున్నాం… దీని సిరా లోపలి వినూత్నమైన వర్ణద్రవ్య కణాల కారణంగా ఈ పెన్నుతో కాగితంపై రాస్తున్నప్పుడు ఇది ఇతర బ్లాక్ జెల్ పెన్నుల కంటే రంగును మరింత నల్లగా కనిపించేలా చేస్తుందన్నమాట.

కాగా ప్రస్తుతం ఈ పెన్నుకు సంబంధించిన వివరాలను కంపెనీ తమ సోషల్ మీడియా( Social Media )లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.దాంతో చాలామంది ఈ పెన్నును కొనడానికి పోటీ పడుతుండడం విశేషం.అయితే ఈ పెన్ను ఇంకా మార్కెట్లో విడుదల కాకపోవడం కొసమెరుపు.
కాగా త్వరలోనే దీనిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించడంతో జనాలు పండగ చేసుకుంటున్నారు.అయితే దీని ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఇంకా ఈ పెన్నుకోసం అనేక దేశాల ఔత్సాహికులు పోటీపడుతున్నట్టు సదరు కంపెనీ తన అఫిసియల్ వెబ్ సైట్లో చెప్పుకొచ్చింది.







