వీడియో: బెంగళూరు ఎయిర్‌పోర్ట్ చూసి ఆశ్చర్యపోయిన జపాన్ ట్రావెల్ వ్లాగర్..

ఇటీవల కాలంలో ఇండియాకి వస్తున్న ఫారిన్‌ టూరిస్టుల సంఖ్య బాగా పెరిగిపోతోంది.

వారు మన ఇండియాలో చూసిన కొన్ని గొప్ప ప్రదేశాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

అలాగే తమకు ఎదురవుతున్న అద్భుతమైన అనుభవాలను పంచుకుంటున్నారు.తాజాగా ప్రముఖ జపనీస్ ట్రావెల్ వ్లాగర్( Japanese Travel Vlogger ) కికీ చెన్( Kiki Chen ) బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం( Bengaluru Kempegowda International Airport ) టెర్మినల్ 2ని చూసి ఆశ్చర్యపోయారు.

ఆమె తన ప్రయాణ అనుభవాన్ని వీడియోలో పంచుకున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది.

టెర్మినల్ 2ని పరిశీలిస్తూ కికీ చెన్ నోరెళ్లబెట్టింది.ఇక్కడ ఉన్న అద్భుతమైన ఔట్‌డోర్ ఈవెంట్ స్పేసెస్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, నికోబార్ లౌంజ్ వంటి ప్రత్యేక ప్రాంతాలను వీడియోలో చూపించింది.

Advertisement

చెకింగ్ కౌంటర్ల వద్ద కూడా వెదురు వాడటం ఆమె దృష్టిని ఆకర్షించింది.ఈ టెర్మినల్‌ను ప్రశంసిస్తూ, ఆమె "ఇండియాలోనే ఉత్తమ విమానాశ్రయం టెర్మినల్ ఇది! చెకింగ్ కౌంటర్ల నుంచి ప్రతిదీ వెదురుతో నిర్మించడం చాలా అద్భుతంగా అనిపించింది.

" అని రాశారు.

కికీ చెన్ తన వీడియోలో "నేను ఇండియా విమానాశ్రయంలో ఉన్నానని నమ్మలేకపోతున్నాను." అని రాసింది.వీడియోలో ఆమె ఆశ్చర్యం స్పష్టంగా తెలుస్తుంది.

ఆమె వీడియోను చూసిన చాలామంది సోషల్ మీడియా యూజర్లు ఆమె అభిప్రాయాన్ని అంగీకరించారు.ఒకరు "ఇది గత సంవత్సరం అత్యంత అందమైన విమానాశ్రయం టెర్మినల్‌గా ఎంపికైంది.

బిర్యానీ లవర్స్.. కొత్త పార్లే-జి బిస్కెట్ల బిర్యానీ వచ్చేసింది.. ట్రై చేసారా?
కెనడా : భారత సంతతి యువతి మరణంపై ముగిసిన దర్యాప్తు.. ఏం తేల్చారంటే?

" అని కామెంట్ చేశారు.మరొకరు "మనదేశాన్ని ఇతర దేశాల వారు అభినందిస్తున్నందుకు మనం గర్వపడాలి" అని అన్నారు.

Advertisement

అయితే, కొంతమంది ప్రతికూలంగా స్పందించారు.ఒకరు కికి చెన్ ఆశ్చర్యపడటాన్ని ప్రశ్నిస్తూ, "ఇండియాలో మంచి నిర్మాణాలు ఉండవు అన్నట్లుగా ఈ అమ్మాయి ఎందుకు నటిస్తుంది?" అని అడిగారు.బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 2 తన మోడ్రన్, ఎకోఫ్రెండ్లీ డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.

గ్రాంట్ అసోసియేట్స్ అనే ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌లు, ప్రముఖ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లాల సలహాల మేరకు ఈ టెర్మినల్‌ను 2,55,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు.దీన్ని "ఒక తోటలోని టెర్మినల్" అని అభివర్ణించవచ్చు.

ఈ టెర్మినల్‌కు ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చేది వెదురుతో నిర్మించిన సీలింగ్.

తాజా వార్తలు